AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మనకెందుకు మావా ఇవన్నీ!.. ఇప్పుడు చూడు ఏమైందో..

సోషల్ మీడియాలో పాపులర్ కావాలని కుర్రకారు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ చిక్కుల్లో పడుతున్నారు. మరికొందరెమో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ కుర్రకారుకు అలా చేయవద్దని పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా బుద్ది రావడం లేదు. పోలీసులు ఎన్ని సార్లు వార్నింగ్ ఇచ్చినా పెడచెవిన పెడుతున్నారు.

Viral Video: మనకెందుకు మావా ఇవన్నీ!.. ఇప్పుడు చూడు ఏమైందో..
Police Chases Bike Raider
Velpula Bharath Rao
|

Updated on: Oct 06, 2024 | 6:48 PM

Share

సోషల్ మీడియాలో పాపులర్ కావాలని కుర్రకారు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ చిక్కుల్లో పడుతున్నారు. మరికొందరెమో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ కుర్రకారుకు అలా చేయవద్దని పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా బుద్ది రావడం లేదు. పోలీసులు ఎన్ని సార్లు వార్నింగ్ ఇచ్చినా పెడచెవిన పెడుతున్నారు. కొందరు రాత్రికి రాత్రే నెటింట్లో హల్చల్ కావాలని ఎంతటి విన్యాసాలు చేయడానికైనా అసలు తగ్గడం లేదు. తాజాగా ఓ ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఆ వీడియోలో ఓ యువకుడు బైక్ స్టంట్ చేస్తుంటే సడెన్‌గా పోలీసుల కారు వచ్చింది. దీంతో అతడు ఏం చేస్తాడు.. అతడు దొరికిపోయాడా? లేదో చూడండి..

ఓ యువకుడు బైక్‌తో ముందటి టైర్‌‌ను పైకి లేకి వెనుక టైర్ పార్టీను కిందికి తాకేలా స్టాంట్ చేద్దామని ప్రయత్నించాడు. కానీ ఆ యువకుడు ఎదురుగా వస్తున్న పోలీసు కారును గమనించలేదు. దీంతో కారు ఎదురుగా వెళ్తాడు. పోలీసు కారు చూసిన తర్వాత బైక్‌ను తిప్పుకొని సందులోకి జారుకుంటాడు. పోలీసు కారు కూడా ఆ వ్యక్తి వెంటె వెళ్తుంది. ఈ వీడియోను తీసిన స్థానికలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్స్ రకరకలుగా స్పందిస్తున్నారు. ఎందుకు భయ్యా మనకు ఇవ్వన్నీ.. ఇప్పుడు చూడు రాత్రంతా జైల్లో నీకు విన్యాసాలు చేయిస్తారు అని కామెంట్స్ చేస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియో ఇదిగో:

View this post on Instagram

A post shared by NAUGHTYWORLD (@naughtyworld)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి