యజమాని చెవి కొరికేసిన పిట్‌బుల్‌.. 11 గంటల పాటు సర్జరీ చేసిన వైద్యులు.. చివరకు ఏం జరిగిందంటే..!

పిట్‌బుల్ డాగన్‌ అనేది అమెరికన్ కుక్కల జాతి. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన కుక్కలల్లో ఇదీ ఒకటి. పిట్‌బుల్ ఒక వ్యక్తి లేదా జంతువుపై దాడి చేస్తే.. దాని నుండి తప్పించుకోవడం కష్టం అవుతుంది. ఇది మధ్యస్థ పరిమాణంలో, తెలివైన, పొట్టిగా ఉండే బొచ్చు కుక్క. మగ కుక్క నిలబడి ఉన్నప్పుడు, దాని ఎత్తు 18 నుండి 21 అంగుళాల వరకు ఉంటుంది. అయితే దాని ..

యజమాని చెవి కొరికేసిన పిట్‌బుల్‌.. 11 గంటల పాటు సర్జరీ చేసిన వైద్యులు.. చివరకు ఏం జరిగిందంటే..!
Surgery
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 05, 2024 | 8:02 AM

చాలా మంది ఇళ్లలో కుక్కలను పెంచుకుంటుంటారు. ఆ పెంపుడు కుక్కలను వారు ఎంతో ప్రేమగా,కుటుంబంలో ఒకరిగా చూసుకుంటారు. అవి కూడా తమ యజమాని పట్ల ఎంతో విశ్వాసంగా ఉంటారు. అవసరమైతే, అవి తమ యజమాని కోసం ప్రాణాలను కూడా అడ్డుపెడుతుంది. కానీ, ఇక్కడో యజమానికి మాత్రం ఊహించిన షాకిచ్చింది వారి ఇంట్లోని పెంపుడు కుక్క. ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పిట్‌బుల్‌ జాతి శునకం అతని చెవిని కొరికేసింది. దీంతో ఆస్పత్రిలో చేరిన అతడికి వైద్యులు 11 గంటల పాటు సర్జరీ చేశారు. చివరకు ఏమైందో పూర్తి వివరాల్లోకి వెళితే…

హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన 22 ఏళ్ల వ్యక్తి ఇంట్లో పిట్‌బుల్‌ డాగ్‌ని పెంచుకుంటున్నాడు. రోజూ మాదిరిగానే అతడు దాంతో సరదాగా ఆడుకుంటున్న క్రమంలో ఆ డాగ్‌ అతడి చెవిని కొరికేసింది. దాంతో ఒళ్లంతా రక్తసిక్తంగా మారింది.. చేవి తలకు వేలాడుతుండగా అతడు హుటాహుటినా ఆస్పత్రిలో చేరాడు. దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అతనికి సర్జరీ జరిగింది. అతి క్లిష్టమైన మైక్రో సర్జికల్ రీప్లాంటేషన్ అనే ప్రక్రియలో అతడి చెవిని తిరిగి కుట్టారు.

వైద్యులు తెలిపిన వివరాల మేరకు.. తలకు వేలాడుతున్న చెవిని అతి జాగ్రత్తగా అతికించారు. తెగిపోయిన చెవిని వెనుకకు కుట్టడమే కాకుండా, బయటి నుండి ఎటువంటి తేడా కనిపించకుండా ప్లాస్టిక్‌ సర్జరీ చేశారు. పిట్ బుల్ దాడి చేసిన వెంటనే అతడు ఆస్పత్రికి చేరుకున్నాడు. అప్పటికే అతడికి రక్తం బాగా పోయిందని చెప్పారు. చెవిలో రక్తనాళాలు పగిలిపోయాయని చెప్పారు. అతి కష్టం మీద యువకుడి చెవిలో రక్తప్రసరణ పునరుద్ధరణ కావడంతో శస్త్ర చికిత్సపై ఆశలు చిగురించాయని వైద్యులు తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..