Shocking Video: ప్రస్తుతం ప్రపంచమంతా సోషల్ మీడియాలో మునిగిపోయింది. కొందరు లైకులు, షేర్లు, కామెంట్ల కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. ఫొటోటు, సెల్ఫీల క్రేజులో తమ విలువైన ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు.ఇటీవల తెలంగాణలో కదులుతున్న రైలుకు దగ్గరగా రీల్స్ చేద్దామని ప్రయత్నించిన ఓ బాలుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిపాలైన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోను ఒక్కసారి చూడండి . ఇందులో కొందరు వ్యక్తులు అగ్నిపర్వతానికి దగ్గరగా సెల్ఫీలు దిగుతున్నారు. పక్కన కొందరు భయంతో కేకలు వేస్తోన్న వీరు మాత్రం సెల్ఫీలు దిగి తమ మూర్ఖత్వాన్ని చాటుకున్నారు. అగ్నిపర్వతం దగ్గర మరిగే లావా ఉష్ణోగ్రత సుమారు 1000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అలాంటి మండుతున్న లావా ఎవరి మీదనైనా పడితే అంతే సంగతులు. అదే సమయంలో దాని అంచుల ఉష్ణోగ్రత సుమారు 500 డిగ్రీలు. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సెల్ఫీ దిగుతారా? కానీ కొందరు ఫొటోలు దిగి తమ స్టుపిడిటీని చాటుకున్నారు.
viralhog అనే ఐడీతో ఇన్‌స్టాగ్రామ్ షేర్ చేసిన ఈ వైరల్ వీడియోలో కొంతమంది అగ్నిపర్వతానికి చాలా దగ్గరగా సెల్ఫీలు తీసుకుంటున్నట్లు చూడవచ్చు. అది కూడా రాత్రి సమయంలో. ఓవైపు మండుతున్న లావా దావానంలా వ్యాపిస్తున్నప్పటికీ సెల్ఫీలు, ఫొటోలు దిగడం కనిపిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు తెగ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘ఈ భూమిపై మనుషులంత తెలివి తక్కువ వారు మరొకరు లేరు’, ‘వీరి పిచ్చి పీక్స్‌కు వెళ్లింది’, ‘సోషల్ మీడియాలో లైకులు, షేర్ల కోసం ఇలాంటి తెలివి తక్కువ పనులు అవసరమా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..