దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదవుతోంది. మధ్యప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో రోడ్లన్నీ నీటితో నిండిపోయి ప్రజలు కాలుతీసి బయటపెట్టాలంటేనే భయపడిపోయే పరిస్థితి నెలకొంది.దాంతో ఓ ప్రాంతానికి చెందిన కొందరు స్థానికులు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్లపై నీటితో నిండిపోయిన గుంతల్లో కుర్చీలు వేసుకుని మద్యం సేవిస్తూ..సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది.
వర్షాలు పడకముందే.. రోడ్లను బాగు చేయాల్సిన బాధ్యత స్థానిక సంస్థలు, ప్రభుత్వాలపై ఉంది. నాసిరకం పనుల కారణంగా వర్షాకాలంలో రోడ్లన్నీ గుంతలతో నిండిపోతున్నాయి. ఈ గుంతల్లో కూర్చున్న వ్యక్తులు కురుస్తున్న వర్షపు నీరు,డ్రైనేజీలోని మురికి నీళ్లలోనే కుర్చీలపై కూర్చొని బురద నీటిలో మాట్లాడుకుంటున్న వీడియోలు సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తున్నాయి. ఆ మురికి నీటి గుంతలో మొక్కలు నాటడం ద్వారా కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. మధ్యప్రదేశ్‌లోని రోడ్డు వీడియో కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
अगर आप ज़िंदादिल हैं तो आपको ईश्वर के अलावा कोई कष्ट नहीं दे सकता। नगर निगम या सरकार को कोसना छोड़िए। अपनी पॉज़िटिवीटी के ‘बीच’ जीवन का आनंद लीजिए।
सड़क के गड्ढे को बीच ? बनाने की ये प्रतिभा मध्य प्रदेश के लोगों ने दिखाई है। ?
— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) July 4, 2022
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి