Viral Video: ఇదేం పిచ్చిరా బాబూ.. చీమలు పట్టిన జీడిపప్పును తిన్న వీడియోకు ఏకంగా 10 మిలియన్ల వ్యూస్‌

Viral Video: జీడిపప్పులో ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉంటాయి. పైగా రుచికరంగానూ ఉంటాయి. అందుకే వీటిని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మరికొందరు మసాలా అద్దుకుని లాగించేస్తుంటారు.

Viral Video: ఇదేం పిచ్చిరా బాబూ.. చీమలు పట్టిన జీడిపప్పును తిన్న వీడియోకు ఏకంగా 10 మిలియన్ల వ్యూస్‌
Cashews With Ants
Follow us
Basha Shek

|

Updated on: Aug 11, 2022 | 7:25 AM

Viral Video: జీడిపప్పులో ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉంటాయి. పైగా రుచికరంగానూ ఉంటాయి. అందుకే వీటిని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మరికొందరు మసాలా అద్దుకుని లాగించేస్తుంటారు. ఇంకొందరు టేస్ట్‌ బాగుందని ఒట్టిగానే తినేస్తుంటారు. అయితే వీటికున్న సమస్య ఏమిటంటే ఈ నట్స్‌కు చీమల బెడద ఎక్కువ. ఎక్కడ దాచినా చీమలు పట్టేస్తుంటాయి. అందుకే కొనేటప్పుడు జాగ్రత్తగా చూసి కొనాలి. అలాగే సరైన ప్రదేశాల్లో నిల్వ చేయాలి. ఇక తినేటప్పుడు ఓసారి పరిశీలించిన తర్వాతే తినాలి. లేకపోతే ఈ యువకుల్లా తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. చీమలు పట్టిన జీడిపప్పును ఏమవుతుందని ఆరగించిన యువకులు ఆ తర్వాత వాంతులు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.

ఎక్స్‌ట్రా ప్రొటీన్‌ అందిందిలే బ్రో..

ఇవి కూడా చదవండి

ఇందులో ఓ ప్యాకెట్‌లో నిల్వచేసిన జీడిపప్పును పోటాపోటీగా తినడం ప్రారంభించారు కొందరు యువకులు. అయితే ఆ ప్యాకెట్‌ సగం ఖాళీ అయ్యేవరకు కూడా అందులో చీమలున్నాయని గుర్తించలేకపోయారు. జీడిపప్పుతోపాటు చీమలను తినేశారు. చివరకు నట్స్‌లో చీమలు కూడా ఉన్నాయని తెలుసుకుని షాక్‌కు గురయ్యారు. ‘ప్యాకెట్‌ లోపల ఏముందో చూసుకోకుండానే జీడిపప్పును ఒక నిమిషం పాటు తిన్నాం’ అని ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు యువకులు. అందులో ఒకరు ఏకంగా వాంతులు చేసుకుంటూ కనిపించాడు. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఈ వీడియోను ఇప్పటివరకు 10 మిలియన్ల మందికి పైగా వీక్షించడం వివేషం. అలాగే 3.56వేల మంది లైక్‌లు కొట్టగా, వేలాది మంది కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘చీమల్లో మంచి ప్రొటీన్‌ ఉంటుంది బ్రో.. సో ప్రాబ్లం లేదులే’ అని ఒకరు కామెంట్ చేయగా.. మాకు కూడా ఇలాగే జరిగింది అంటూ మరికొందరు తమ అనుభవాలను పంచుకున్నారు. మరి మిలియన్ల వ్యూస్‌ దక్కించుకున్న ఈ వైరల్‌ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by RedCup News (@redcupnews)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి