పాకిస్థాన్ నుంచి ఓ వింత వార్త వెలుగులోకి వచ్చింది. పెద్ద పెద్ద కోటీశ్వరులు, ధనవంతులు కూడా నోరెళ్ల బెట్టేలా ఓ బిచ్చగాడు చేసిన దావత్ ఏర్పాట్లు ఇంటర్‌నెట్‌ని సైతం ఊపేసింది. బిచ్చమెత్తుకూ జీవించే ఓ వ్యక్తి సుమారు 20,000 మందికి భారీ విందు భోజనాలు పెట్టించాడు. దీని కోసం ఏకంగా రూ.1.25 కోట్లు ఖర్చు చేసినట్టుగా తెలిసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతున్నాయి.. ఇది చూసి ఆ ప్రాంతంలోని సామాన్య ప్రజలతోపాటు కోటీశ్వరులు, నెటిజన్లు సైతం షాక్ అయ్యారు. అసలు విషయంలోకి వెళితే…
పాకిస్థాన్‌లోని గుజ్రాన్‌వాలాలో ఈ సంఘటన జరిగింది. ఒక బిచ్చగాడి నానమ్మ ఇటీవల మరణించింది. దీంతో 40వ రోజు స్మారకం సందర్భంగా అతడి కుటుంబం భారీ విందు ఏర్పాటు చేసింది. స్థానికులను, తెలిసినవారిని భోజనాలకు ఆహ్వానించింది. పాకిస్థాన్‌లోని పంజాబ్ నలుమూలల నుంచి సుమారు 20,000 మంది వరకు ఈ విందుకు హాజరయ్యారు. సిరి పాయె, మురబ్బా వంటి సాంప్రదాయ వంటకాలతోపాటు వివిధ మాంసాహార వంటకాలను వడ్డించారు. ఈ విందు కోసం సుమారు 250 మేకలు కొనుగోలు చేసినట్టుగా తెలిసింది.
వీడియో ఇక్కడ చూడండి..
Beggars in Gujranwala reportedly spent Rs. 1 crore and 25 lacs on the post funeral ceremony of their grand mother 🤯🤯
Thousands of people attended the ceremony.
They also made arrangement of all kinds of meal including beef, chicken, matranjan, fruits, sweet dishes 😳😳 pic.twitter.com/Jl59Yzra56— Ali (@PhupoO_kA_betA) November 17, 2024
ఇకపోతే, విందు వచ్చే అతిథులను తరలించేందుకు సుమారు 2,000లకు పైగా వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. గుజ్రాన్‌వాలాలోని రహ్వాలి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కాగా, ఇదంతా చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు. ఓ బిచ్చగాడు ఇంత భారీ ఎత్తున విందు కార్యక్రమం ఏర్పాటు చేయటం పట్ల ప్రజలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ విందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆహారం తిన్న తర్వాత, అతిథులు ఈ కుటుంబాన్ని చాలా ప్రశంసించారు. ఆ బిచ్చగాడు ఎంత ధనవంతుడో విందు కోసమే ఇంత డబ్బు ఖర్చు పెట్టాడని సోషల్ మీడియాలో జనాలు అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..