Viral Video: వాహనదారులతో పోటీ పడి పరిగెత్తిన నిప్పుకోడి..వీడియో వైరల్..

|

Oct 28, 2021 | 9:41 AM

నిప్పుకోడి...ఎగరలేని పక్షి జాతుల్లో ఇది అతి పెద్దది. దీనినే ఉష్ట్రపక్షి లేదా ఆస్ట్రిచ్‌ అని కూడా పిలుస్తుంటారు..

Viral Video: వాహనదారులతో పోటీ పడి పరిగెత్తిన నిప్పుకోడి..వీడియో వైరల్..
Follow us on

నిప్పుకోడి…ఎగరలేని పక్షి జాతుల్లో ఇది అతి పెద్దది. దీనినే ఉష్ట్రపక్షి లేదా ఆస్ట్రిచ్‌ అని కూడా పిలుస్తుంటారు. ఆకర్షణీయమైన ఈకలు, చర్మం కలిగి ఉండే ఈ పక్షి ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లోనే కనిపిస్తుంటుంది. అయితే తాజాగా పాకిస్తాన్‌ రోడ్లపై దర్శనమిచ్చిన ఆస్ట్రిచ్‌.. వాహనదారులతో పాటు వేగంగా పరిగెత్తుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
వాటిని అడవుల్లో వదిలిపెట్టండి..
‘లాహోర్‌ నగరం సమీపంలోని అడువుల నుంచి తప్పించుకుని మొత్తం రెండు నిప్పుకోళ్లు రోడ్డు మీదకు వచ్చాయి. అయితే కొందరు వాహనదారులు వాటిని పట్టుకుని ఫొటోలు తీసుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో మెడకు తీవ్ర గాయమై ఒకటి మృత్యువాత పడింది’ అని పాకిస్తాన్‌ కు చెందిన ఓ న్యూస్‌ వెబ్‌సైట్ తెలిపింది. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు ‘జంతువులు అడవుల్లోనే క్షేమంగా ఉంటాయి. మనుషుల మధ్యన అవి సుఖంగా జీవించలేవు. దయచేసి వాటిని అడవుల్లో వదిలిపెట్టండి’ అని భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

Also Read:

అడవి పిల్లిని ఎప్పుడైనా చూసారా.. ఇదే దాని స్పెషాలిటీ..! వీడియో

వామ్మో ఎంత పెద్ద నాలుక.. దాంతో ఏం చేసిందో షాక్ అవుతారు.. వీడియో

వామ్మో ఇదేం పిచ్చి..! ఐదేళ్ల నుంచి ఇంటి గోడలను తింటున్న మహిళ..