ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బిజినెస్‌లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్‌గా ఉంటారు. చాలా స్పాంటేనియస్‌గా స్పందిస్తూ.. నెటిజన్లను ఆకట్టుకుంటారు. సోషల్ మీడియాలో ఆయన చేసే పోస్ట్‌లు ఆసక్తికరంగా, ప్రేరణాత్మకంగా ఉంటాయి. తాజాగా హర్ష్ గోయెంకా చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాను ఊపేస్తుంది.
ఈ మధ్య కాలంలో ఆప్టికల్ ఇల్యూజన్ పిక్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. వీటి వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చూసేందుకు అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ.. అందులోనే ఒక రహస్యం దాగి ఉంటుంది. దాన్ని కనిపెట్టడమే టాస్క్. ఈ టాస్క్ చేయాలంటే.. మనకు సహనం అవసరం. అదే సమయంలో ఆలోచనా శక్తి కూడా ఉండాలి. అందుకే ఈ ఆప్టికల్ ఇల్యూజన్స్ బాగా వైరల్ అవుతున్నాయి. వీటిని చేయడం వలన.. మైండ్ షార్ప్ అవడంతో పాటు, ఆలోచనా శక్తి, ఓర్పు పెరుగుతుంది. మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది.
తాజాగా హర్ష్ గోయెంకా కూడా ఓ ఆప్టికల్ ఇల్యూజన్ పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలో అనేక ఇళ్లు ఉన్నాయి. వాటి మధ్యలో ఓ పిల్లి దాగుంది. దాన్ని కనిపెట్టడమే హర్ష్ గోయెంకా ఇచ్చిన టాస్క్. అంతేకాదండోయ్.. కేవలం 10 సెకన్లలో కనిపెట్టాలంటూ టార్గెట్ కూడా ఇచ్చేశారు. చాలా ఇంట్రస్టింగ్‌గా ఉన్న ఈ ఆప్టికల్ ఇల్యూజన్ పిక్ కి నెటిజన్ల నుంచి మంచి రెస్పాండ్స్ వస్తోంది. అందులో దాగున్న పిల్లిని కనిపెట్టేందుకు చాలామంది ట్రై చేస్తున్నారు. దూరంగా చూస్తే కాస్త కష్టంగా ఉండొచ్చు కానీ, కాస్త జూమ్ చేసి చూస్తే మాత్రం పిల్లిని కనిపెట్టడం ఈజీ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం..మీరు కూడా ట్రై చేయండి మరి.
If you are observant, you will find the cat in 10 seconds… pic.twitter.com/fisVmjJWFl
— Harsh Goenka (@hvgoenka) January 22, 2023
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..