Optical illusions: సోషల్ మీడియా అన్ని అవసరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి రావడం, స్మార్ట్ ఫోన్‌లు కూడా తక్కువ ధరకు లభిస్తుండడంతో సోషల్ మీడియాను ఉపయోగిస్తున్న వారు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. ఇక నెటిజన్ల ఆసక్తికి అనుగుణంగా కొందరు ఔత్సాహిక క్రియేటర్లు రకరకాల పోస్ట్‌లతో యూజర్లను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల ఆప్టికల్ ఇల్యూజన్ పేరుతో నెట్టింట వైరల్ అవుతోన్న ఫొటోలు ఈ జాబితాలోకే వస్తాయి. ఫొటోలను వినూత్నంగా డిజైన్ చేస్తూ అందులో ఉన్న కొన్ని ఫొటోలను గుర్తించండి అంటూ పోస్టులు చేస్తున్నారు.
తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే నెట్టింట వైరల్ అవుతోంది. కంటి చూపు పవర్‌కి పరీక్ష పెట్టేలా ఉందీ ఫొటో. పైన కనిపిస్తోన్న ఫొటోలో టేబుళ్లు, సోఫాలు, కుర్చీలతో పాటు ఫ్లవర్ వాజ్‌లు కనిపిస్తున్నాయి కదూ.! అయితే అందులోనే ఓ టేబుల్ ల్యాంప్ ఉందన్న విషయం మీకు తెలుసా.? ఆ టేబుల్ ల్యాంప్‌ను గుర్తించమనే క్యాప్షన్‌తో ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఏంటి ఎంత వెతికినా ల్యాంప్ కనిపించలేదా.? అయితే ఫొటోలో లెఫ్ట్‌సైడ్‌లో ఉన్న వైట్ సోఫా వెనకాల గ్రీన్ కలర్‌లో ల్యాంప్ అచ్చంగా ఫ్లవర్ వాజ్‌లా కనిపిస్తోంది చూడండి. ఎంత ట్రై చేసినా గుర్తించకపోతే కింద రెడ్ కలర్ రింగ్‌లో ల్యాంప్ కనిపిస్తోంది చూసేయండి. మరెందుకు ఆలస్యం ఈ ఫొటోను మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసి వారికి కూడా సవాల్ విసరండి. వారి ఐ పవర్ ఎంతుందో చెక్ చేసుకోమనండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..