Dog security for boy: మా హీరో నిద్రపోతున్నాడు.. ఎవరైనా డిస్టర్బ్ చేసారో.. అదిరిపోయే శునకం వార్నింగ్..
పెంపుడు కుక్కలు తమ యజమానులతో ఎంతో అనుబంధాన్ని పెంచుకుంటాయి. చిన్ని పిల్లలతో మంచి స్నేహం చేస్తాయి. వారితో కలిసి ఆడుకోవడమే కాదు..
పెంపుడు కుక్కలు తమ యజమానులతో ఎంతో అనుబంధాన్ని పెంచుకుంటాయి. చిన్ని పిల్లలతో మంచి స్నేహం చేస్తాయి. వారితో కలిసి ఆడుకోవడమే కాదు.. వారికి ఎలాంటి ఆపద రాకుండా రక్షణ కల్పిస్తాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ చిన్నారి, కుక్కకు సబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఒక చిన్న బాలుడు మంచంపైన నిద్రపోతున్నాడు. అతని పక్కనే వాళ్ల పెంపుడు కుక్క కూడా ఉంది. ఆ బాలుడు నిద్రపోతున్నప్పుడు ఆ కుక్క చిన్నారిని ఎంతో ఆప్యాయంగా చూస్తూ అతన్ని స్పర్శిస్తూ ఉంటుంది. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి ఆ బాలుడిని నిద్ర లేపబోతాడు. దాంతో ఆ కుక్క అతన్ని డిస్టర్బ్ చేయొద్దన్నట్టుగా అతని చేయిని పట్టుకొని వారిస్తుంది. ఈ క్యూట్ సన్నివేశం నెటిజన్ల మనసు దోచుకుంటోంది. ఈ వీడియోను ఓ యూజర్ తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ వీడియోలో బాలుడితోపాటు పెంపుడు కుక్క మంచం మీద పడుకుని ఉంది. బాలుడిని కౌగిలించుకుని ఉంది. బాలుడు నిద్రపోతుండగా అతడికి కాపలా కాస్తుంది. బాలుడి తండ్రి అతడిని లేపేందుకు ప్రయత్నిస్తుండగా కుక్క వారించింది. చివరగా బాలుడు లేచి, కుక్కను హగ్ చేసుకొని ప్రేమగా దానికి ముద్దులు పెట్టాడు. ఈ హార్ట్ టచ్చింగ్ వీడియోను నెటిజన్లు చాలా ఇష్టపడుతున్నారు. లక్షల మంది వీక్షించగా.. వేలల్లో లైక్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Car – ambulance: అంబులెన్స్‌తో రేస్ పెట్టుకుని కారు డ్రైవర్.. సీన్ కట్ చేస్తే షాకింగ్ ఘటన.!
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?