Viral News: గుమ్మడికాయకు వేలంపాట.. ఎంత ధర పలికిందో తెలిస్తే మైండ్ బ్లాంక్..

|

Sep 11, 2022 | 11:01 AM

ఇప్పుడు అంతా లడ్డూ వేలం సీజన్ నడుస్తోంది. వినాయక చవితి ఉత్సవాలు పూర్తై అన్ని చోట్ల దాదాపు నిమజ్జనాలు పూర్తయ్యాయి. ఇక అన్ని చోట్ల లడ్డూల వేలం వార్తలే కనిపిస్తున్నాయి. అత్యధిక ధర బాలాపూర్ లడ్డూ అంటే.. దానిని మించి అల్వాల్‌లో రికార్డు ధర. ఇలా చెప్పుకుంటూ పోతే లడ్డూల..

Viral News: గుమ్మడికాయకు వేలంపాట.. ఎంత ధర పలికిందో తెలిస్తే మైండ్ బ్లాంక్..
Pumpkin Auction
Follow us on

Viral News: ఇప్పుడు అంతా లడ్డూ వేలం సీజన్ నడుస్తోంది. వినాయక చవితి ఉత్సవాలు పూర్తై అన్ని చోట్ల దాదాపు నిమజ్జనాలు పూర్తయ్యాయి. ఇక అన్ని చోట్ల లడ్డూల వేలం వార్తలే కనిపిస్తున్నాయి. అత్యధిక ధర బాలాపూర్ లడ్డూ అంటే.. దానిని మించి అల్వాల్‌లో రికార్డు ధర. ఇలా చెప్పుకుంటూ పోతే లడ్డూల వేలానికి భలే క్రేజీ ఉంది. గణపతి వద్ద పెట్టిన లడ్డూను ఎలాగైనా వేలంపాటలో దక్కించుకోవాలని చాలామంది సెంటిమెంట్ గానూ పెట్టుకుంటారు. దీని కోసం పోటీపడి పాట పాడతారు. అవసరమైతే ధర ఎంతన్నది మర్చిపోయి మరి వేలంలో లడ్డూను దక్కించుకోవడమే పనిగా పెట్టుకుంటారు. గ్రామాల్లో సైతం ఇప్పుడు ఈట్రెండ్ కొనసాగుతోంది. చాలా గ్రామాల్లో వినాయకుడి లడ్డూ ధర వేలంలో లక్షలు పలుకుతోంది. ఇంతవరకు బాగానే ఉంది. కాని ఇప్పుడు గుమ్మడికాయకు వేలం పాట వైరల్ అవుతోంది. ఏంది గుమ్మడికాయకు వేలం ఏమిటి.. మార్కెట్లోకి వెళ్లి రూ.500 ఇస్తే కావాల్సిన సైజులో గుమ్మడికాయ వస్తుంది కదా అనుకుంటున్నారా.. అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే వినాయకచవితిలో గణపతి లడ్డూకు ఎంత క్రేజ్ ఉందో కేరళలో ఓనం పండుగ సందర్భంగా నిర్వహించే వేలానికి అంతే క్రేజ్ ఉంది. అసలు ఈగుమ్మడికాయ వేలం ఏంటో తెలుసుకుందాం.

సాధారణంగా గుమ్మడికాయ అంటే ఓ రూ.200, రూ.300 ఉంటుంది అనుకుంటాం. కాని అక్షరాలా రూ.47 వేలు పలికింది ఓ గుమ్మడికాయ. ఇంత ధర పలకడమేంటి గుమ్మడికాయ అని ఆశ్చర్యం కలగవచ్చు. కాని ఇది నిజం కేరళలోని ఇడుక్కిలోని కొండ ప్రాంతంలో చెమ్మన్నార్ అనే గ్రామం ఉంది. ఆగ్రామంలో ఓనం పండగ సందర్భంగా బహిరంగ వేలం నిర్వహించారు. ఈవేలంపాటలో 5కిలోల గుమ్మడికాయను రూ.47,000 దక్కించుకున్నాడు ఓ వ్యక్తి. సాధారణంగా ఈవేలంలో పొట్టేళ్లు, కోళ్లు ధర వేలల్లో పలుకుతాయి. కానీ ఈసారి గుమ్మడికాయకు భారీ ధర పలికింది. దీంతో నిర్వహకులు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. నెటిజన్లు మాత్రం ఈగుమ్మడికాయలో స్పెషల్ ఏంటో.. ఇంత ధర పలికిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఓనం అనేది కేరళలో మళయాళీలకు ప్రధాన పండుగ. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మళయాలీలు ఈపండుగను జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఓనం పండుగను భాద్రపద మాసంలో జరుపుకుంటారన్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..