Viral: ఒకేసారి 11 పాములు నోట్లో పెట్టేసుకున్నాడు.. ఫోటోలు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.!

|

Dec 04, 2021 | 10:21 PM

ప్రతీ పనిలోనూ ఓ విభిన్నత ఉండాలని చాలామంది కోరుకుంటారు. అందుకోసం రాత్రింబవళ్ళు శ్రమిస్తారు...

Viral: ఒకేసారి 11 పాములు నోట్లో పెట్టేసుకున్నాడు.. ఫోటోలు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.!
Snakes
Follow us on

ప్రతీ పనిలోనూ ఓ విభిన్నత ఉండాలని చాలామంది కోరుకుంటారు. అందుకోసం రాత్రింబవళ్ళు శ్రమిస్తారు. ఇలా విభిన్నంగా చేయాలని ప్రయత్నించే వారు చాలా విచిత్రమైన ప్రపంచ రికార్డులను నమోదు చేస్తుంటారు. అలాగే అలాంటి రికార్డులను నెలకొల్పేందుకు ఎంతటికైనా తెగిస్తారు. వింత, విచిత్రమైన, ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు చేసి రికార్డులు సృష్టిస్తుంటారు. అలాంటి ఓ రికార్డు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. దాని గురించి విన్నాక మీరు కూడా ఇదేం సోదరా.. ఈ పిచ్చేంటి అని తిడతారు.

టెక్సాస్‌లో నివసించే జాకీ బిబ్బీ ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు ఒకేసారి 11 ప్రమాదకరమైన విషపూరిత రాటిల్ పాములను నోట్లో పెట్టుకున్నాడు. అయితే రికార్డు మాత్రం సాధించలేకపోయాడు. ఇదే ఫీట్‌ను 2010లో చేసిన బిబ్బీ.. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌‌లో చోటు సంపాదించగా.. ఇప్పుడు మాత్రం ఆ క్యాటగిరీని తొలగించడంతో.. ప్రపంచ రికార్డును నెలకొల్పలేకపోయాడు.

కాగా, ‘త్రోబ్యాక్ థర్స్‌డే’ కింద గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్.. ఇతడి ఫోటోను తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసింది. చేతుల సాయం తీసుకోకుండా 11 రాటిల్ స్నేక్స్‌ను డైరెక్ట్‌గా నోట్లో పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ స్టంట్ ఎంత ప్రమాదకరమైనదో చిత్రాలను చూస్తే మీకే అర్ధమవుతుంది. జాకీని ఒక్క పాము కాటు వేసినా.. అతడు మరణించడం ఖాయం.

కాగా, ఈ ఫీట్ చేసిన  తర్వాత అతడు అసలు కారణం చెప్పాడు.. ”ఇలాంటి ప్రపంచ రికార్డుల కోసం చాలామంది తమ జీవితాలతో పణంగా పెడతారని.. ఈ స్టంట్ మరెవ్వరూ చేయకూడదని కోరుకుంటున్నా” అని బిబ్బీ పేర్కొన్నాడు. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పాములలో ఒకటి రాటిల్ స్నేక్. దాని విషం క్షణాల్లో మనిషి ప్రాణాలను తీసేస్తుంది.

ఇవి కూడా చదవండి:

పడగవిప్పి కోపంతో రగిలిపోతున్న భారీ నాగుపాము చూశారా.? వెన్నులో వణుకు పుట్టించే వీడియో మీకోసమే!

17 బంతుల్లో 78 పరుగులు.. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్ల ఊచకోత.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో వీరవిహారం.!

అటకపై అనుకోని అలజడి.. ఎలుక అనుకుని వెళ్లి చూడగా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!