Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: ఈ 3 రాశులవారు జగమొండి.. ఎవ్వరి మాట అస్సలు వినరు.. ఏయే రాశులంటే.?

మనలో చాలామంది మొండి ఘటాలు ఉంటారు. వారిని ఒప్పించడం చాలా కష్టం. మంచి కోసం చెప్పినా కూడా..

Zodiac Signs: ఈ 3 రాశులవారు జగమొండి.. ఎవ్వరి మాట అస్సలు వినరు.. ఏయే రాశులంటే.?
Zodiac Signs
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 04, 2021 | 9:49 PM

మనలో చాలామంది మొండి ఘటాలు ఉంటారు. వారిని ఒప్పించడం చాలా కష్టం. మంచి కోసం చెప్పినా కూడా.. వారి మాటనే నెగ్గించుకుంటారు. వీళ్ళేంటి.. వీళ్ల స్వభావం ఏంటి అనుకుంటూ మనం విసుగు చెందవచ్చు. అయితే అది వాళ్ల తప్పు కాదు. రాశిచక్రం, నక్షత్ర ప్రభావం కారణం వారి వ్యక్తిత్వం అలాంటిది మరి. జోతిష్యశాస్త్రం ప్రకారం.. 3 రాశులవారు జగమొండి అట. వారెవరో చూసేద్దాం పదండి.

కుంభరాశి:

ఈ రాశివారు జగమొండి. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారంటే.. దాన్ని మార్చడం ఎవ్వరికి సాధ్యం కాదు. వీరి ఇతరుల మాట వింటారు. కానీ వారికి నచ్చింది మాత్రమే చేస్తారు. వీరు నిర్ణయాల విషయంలో చాలా డిఫెన్సివ్ మోడ్‌లోకి వెళ్తారు. వారికి ఉత్తమమైన మార్గం అనుకున్న దానినే ఎంచుకుంటారు.

మిధునరాశి:

ఈ రాశివారు మొండిగా ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా తమ సమర్ధ్యలపై నమ్మకం పెట్టుకుంటారు. తమ నిర్ణయాలు మార్చుకోవాలని ఎప్పుడూ అనుకోరు. ఇది ఖచ్చితంగా జరుగుతుందని వారికి అనిపిస్తే.. తమ అభిప్రాయాలను అస్సలు మార్చుకోరు. కొన్ని సందర్భాల్లో వారి అంతర్ దృష్టి 100 శాతం వర్కౌట్ అవుతుంది.

వృషభరాశి:

ఈ రాశివారు అప్పుడప్పుడూ మొండిగా ప్రవర్తిస్తుంటారు. వీరిలో నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి. సరైనా నిర్ణయాలు తీసుకుంటుంటారు. వీరు తమ జీవితంలో స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు. ప్రతీ విషయంలోనూ బాధ్యతగా వ్యవహరిస్తారు. అది ఏదైనా అంశం కావొచ్చు. ఆర్ధిక వ్యవహారాలు కావొచ్చు. మీకు వృషభరాశి వారు స్నేహితులు అయి ఉంటే.. వారికి సలహా ఇవ్వాలనుకోవద్దు. వారిని చర్చలోకి తీసుకురావడం చాలా కష్టం.

కాగా, ఈ మూడు రాశుల వారు జగమొండి. వారిని ఒప్పించడం చాలా కష్టం. అందుకే వీరితో మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జానపద విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కేవలం ప్రజల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ప్రచురితమైంది.

ఇవి కూడా చదవండి:

పడగవిప్పి కోపంతో రగిలిపోతున్న భారీ నాగుపాము చూశారా.? వెన్నులో వణుకు పుట్టించే వీడియో మీకోసమే!

17 బంతుల్లో 78 పరుగులు.. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్ల ఊచకోత.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో వీరవిహారం.!

అటకపై అనుకోని అలజడి.. ఎలుక అనుకుని వెళ్లి చూడగా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!