ఫ్రెండ్‌ను కలవాలని ఆశతో వచ్చిన వృద్దుడికి షాకింగ్ సీన్.. లాస్ట్ గిఫ్ట్ చూస్తే కన్నీళ్లు ఆగవు

స్నేహానికన్న మిన్న లోకాన లేదురా... కడ దాక నీడ లాగ నిను వీడిపోదురా అన్నాడో సినీ కవీ. ఇప్పుడు స్నేహం గొప్పదనం తెలియజేసే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక వృద్ధుడు తన చిన్ననాటి స్నేహితుడికి అనారోగ్యంగా ఉందని తెలుసుకుని.. తన ఫ్రెండ్ ని చూడడానికి వెళ్తూ.. అతనికి ఇష్టమైనవి పట్టుకుని వెళ్ళాడు. అయితే అక్కడ జరిగిన సంఘటన చూపరులను భావోద్వేగానికి గురిచేస్తోంది.

ఫ్రెండ్‌ను కలవాలని ఆశతో వచ్చిన వృద్దుడికి షాకింగ్ సీన్.. లాస్ట్ గిఫ్ట్ చూస్తే  కన్నీళ్లు ఆగవు
Viral Video

Updated on: Oct 14, 2025 | 4:33 PM

నిజమైన ఒక స్నేహితుడు ఉంటే చాలు జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా.. సరే సంతోషంగా జీవితాన్ని గడిపేయవచ్చు. అలాంటి స్నేహితులను చూడడం ఎప్పుడూ అపురూపం. స్నేహం అంటే వీరిదే అని అంటాం కూడా.. ఈ ప్రపంచంలో స్నేహం అనేది ఒక విలువైన సంబంధం. ఎటువంటి స్వార్ధం ఉండదు. ఈ సంబంధంలో మాటల కంటే హృదయపూర్వక భావాలు ముఖ్యమైనవి. ఇప్పుడు స్నేహం గొప్పదనం గురించి తెలియజేసే ఒక వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఇది చూసిన వారి కంట కన్నీరు తెప్పిస్తోంది. అదృష్టవంతులకు మాత్రమే ఇలాంటి స్నేహితులు దొరుకుతారని నెటిజన్లు అంటున్నారు.

ఈ వైరల్ వీడియో రాజస్థాన్‌లోని ప్రముఖ బిజేపీ నాయకుడు, మాజీ మంత్రి దివంగత నంద్‌లాల్ మీనాకు సంబంధించినది. అతని చిన్ననాటి స్నేహితుడు నంద్‌లాల్ మీనా అనారోగ్యానికి సంబంధించిన వార్త విన్నాడు. ఆ తర్వాత ఆయనను కలవడానికి నంద్‌లాల్ ఇంటికి వస్తున్నట్లు వీడియో చూస్తే తెలుస్తుంది. ఆ వృద్ధ స్నేహితుడు తన పొలం నుంచి తాజా సొరకాయలను బహుమతిగా తెచ్చాడు.

ఇవి కూడా చదవండి

అయితే తన స్నేహితుడి ఇంటికి చేరుకున్న తర్వాత..అతను విన్న వార్త అతన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తన ప్రియమైన స్నేహితుడు, ఏడుసార్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి నందలాల్ మీనా మరణించారని అతను తెలుసుకున్నాడు. ఇది విన్న ఆ వృద్ధుడు నేలపై కూర్చుని తన స్నేహితుడి ఫోటో ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఆ వృద్ధుడు తన స్నేహితుడి కోసం తెచ్చిన చివరి బహుమతిని తన బ్యాగు లో నుంచి తీసి చూసుకున్నాడు. ఈ సన్నివేశం చూసి అక్కడ ఉన్న ప్రజలకన్నీళ్లు పెట్టుకున్నారు. మనసుని హత్తుకుని.. భావిద్వేగానికి గురి చేస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. 25 మిలియన్ల మందికి పైగా దీనిని చూశారు.

“మనసుని హత్తుకునే కరుణ , ప్రేమను చూసి నా కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి” అని ఒకరు వ్యాఖ్యానించారు. మరొకరు, “ఈ క్షణం వారికి చాలా కష్టంగా ఉండి ఉండాలి. నేను మీ స్నేహానికి సెల్యూట్ చేస్తున్నాను” అని అన్నారు. మరొకరు, “అదృష్టవంతులకే అలాంటి స్నేహం లభిస్తుంది సోదరా” అని వ్యాఖ్యానించారు.

వీడియోను ఇక్కడ చూడండి

 

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..