Viral Video: నవ దంపతులకు స్నేహితుల షాక్‌.. పెళ్లిలో ఏకంగా దాన్నే గిఫ్ట్‌గా ఇచ్చారు..

Viral Video:  పెళ్లంటే సరదాలు, సంతోషాలతో సన్నిహితుల, స్నేహితులు చిలిపిచేష్టలు ఉంటాయి. ఇందులో భాగంగా నూతన వధూవరులను ఆట పట్టించేందుకు రకరకాల బహుమతులు ఇస్తుంటారు

Viral Video: నవ దంపతులకు స్నేహితుల షాక్‌.. పెళ్లిలో ఏకంగా దాన్నే గిఫ్ట్‌గా ఇచ్చారు..
Wedding

Edited By:

Updated on: Apr 08, 2022 | 8:10 AM

Viral Video:  పెళ్లంటే సరదాలు, సంతోషాలతో సన్నిహితుల, స్నేహితులు చిలిపిచేష్టలు ఉంటాయి. ఇందులో భాగంగా నూతన వధూవరులను ఆట పట్టించేందుకు రకరకాల బహుమతులు ఇస్తుంటారు. గతంలో టమాట, ఉల్లిపాయల ధరలు మండిపోయినప్పుడు కొత్త జంటకు గిఫ్ట్‌గా ఇచ్చిన సంఘటనలు మనం చూశాం. సోషల్ మీడియాలోనూ అవి వైరల్‌గా మారాయి. అలా ప్రస్తుతం దేశంలో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కేవలం16 రోజుల్లోనే 14 సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో రూ.120 దాటేసింది. దీంతో వాహనాలు బయటకు తీయాలంటేనే భయపడుతున్నారు చాలామంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ కన్నా విలువైనది ఏదీ లేదంటూ దానినే కొత్తగా పెళ్లైన దంపతులకు గిఫ్ట్​గా ఇచ్చారు వారి స్నేహితులు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన గిరీష్​ కుమార్, కీర్తనలకు కొన్ని రోజుల క్రితమే పెళ్లి జరిగింది. చెంగల్​పట్టు జిల్లాలోని చెయ్యూర్​లో వీరి వివాహ వేడుకలు ఘనంగా సాగాయి. అన్ని వేడుకల్లో లాగే పెళ్లికొచ్చిన అతిథులు, సన్నిహితులు కొత్త జంటకు కానుకలు ఇచ్చారు. ఇంతలోనే వేదికపైకి వచ్చిన స్నేహితులు నూతన వధూవరులకు రెండు బాటిళ్లను బహుమతులుగా ఇచ్చారు. వాటిలో ఒకదానిలో పెట్రోల్, మరో బాటిల్ లో డీజిల్ నింపి ఇచ్చారు. దీన్ని చూడగానే వారు మొదట ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత.. సరదాగా నవ్వుకున్నారు. పెళ్లికి హాజరైన అతిథులు కూడా నవ్వుల్లో మునగిపోయారు. ఈ వీడియోను ఓ నెటిజన్​సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా..అది కాస్తా వైరల్‌ గా మారింది.

Also Read:Pakistan Political Crisis: మళ్లీ ఓటింగ్‌ నిర్వహించాలి.. ఇమ్రాన్‌ఖాన్‌కు సుప్రీంకోర్టు షాక్‌..

ఈ ఆలయంలో మద్యమే ప్రసాదం !! వెలుగులోకి వెరైటీ జాతర !!

Robotic Goat Video: కవాసాకీ రోబో మేక !! దీని ప్రత్యేకతలు నెక్స్ట్‌ లెవల్‌ !!