AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఓరీ దేవుడో.. నంది ఉగ్ర రూపం భయానకం..! శివ భక్తుడిని విసిరి కొట్టి బీభత్సం.. షాకింగ్‌ వీడియో వైరల్‌

నంధీశుడికి కోపం వచ్చింది.. ఆలయానికి వచ్చిన శివ భక్తుడిపై విశ్వరూపం ప్రదర్శించింది. క్షమించమని పాదాలు పట్టుకుని ప్రదేయపడితేగానీ, శాంతించి ఆశీర్వదించలేదు..ఎట్టకేలకు నంది శాంతించటంతో బ్రతుకు జీవుడా అన్నట్టుగా ఆ శివభక్తుడు ప్రాణాలతో బయటపడగలిగాడు. అసలు ఇంతకీ ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..

Watch: ఓరీ దేవుడో.. నంది ఉగ్ర రూపం భయానకం..! శివ భక్తుడిని విసిరి కొట్టి బీభత్సం.. షాకింగ్‌ వీడియో వైరల్‌
Nandi Gets Angry
Jyothi Gadda
|

Updated on: Sep 22, 2024 | 9:52 PM

Share

నందిని ఆ భోళ శంకరుడి వాహనంగా భావిస్తారు. నందిలేని శివాలయం ఎక్కడా ఉండదు. భక్తులు నందిని కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో అలంకరించి పూజిస్తుంటారు. అయితే, ఇటీవల వైరల్ అయిన ఒక వీడియోలో ఎంతో బాగా అలంకరించబడి ఉన్న ఒక నంది అకస్మాత్తుగా ఒక యువకుడిపై వికృతంగా దాడికి పాల్పడింది. ఆలయానికి వచ్చిన ఒక శివ భక్తుడిపై నందికి ఉన్నట్టుండి కోపం వచ్చింది. దాంతో అతన్ని విచక్షణా రహితంగా కుమ్మేసింది ఆ నంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో.. @biharigurl ఎక్స్‌ ఖాతాలో వైరల్‌గా మారింది. దీనిపై వినియోగదారులు కూడా విపరీతంగా స్పందించారు.

తెల్ల చొక్కా, మ్యాచింగ్‌ ప్యాంటు ధరించి ఉన్న ఒక శివభక్తుడు గుడిలో పూజ చేసేందుకు వచ్చాడు. అంతలోనే అలంకరించి ఉన్న ఒక ఎద్దు అతనిపై దాడి చేసింది. అతన్ని తన కొమ్ములతో ఎత్తి కుదిపేసింది. కొమ్ములతో పొడిచేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆ వ్యక్తికి ఏం చేయాలో, ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు..భక్తుడిపై ఎద్దు దాడి చేస్తున్న క్రమంలో ఆ శివ భక్తుడు తనను క్షమించాలంటూ వేడుకుంటున్నాడు. ఆ ఎద్దు కాళ్లు పట్టుకుని మరీ ప్రాధేయపడుతున్నాడు. యువకుడు నంది పాదాలను పట్టుకుని క్షమాపణ చెప్పడం ప్రారంభించాడు. దీంతో ఎట్టకేలకు ఆ నంది నంది కోపం చల్లారింది. అతన్ని విడిచిపెట్టింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

@biharigurl అనే ఎక్స్‌ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటివరకు 615 K వీక్షణలు వచ్చాయి. 5.6 వేల మందికి పైగా ఈ క్లిప్‌ను లైక్ చేసారు. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో కామెంట్లు చేస్తున్నారు. ఒక వినియోగదారు రాశారు- ఓం నమః శివాయ్, మరొకరు హర్ హర్ మహాదేవ్ నినాదాన్ని లేవనెత్తారు. భక్తులపై ఆ మహాదేవుడి ఆశీస్సులు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..