తలుపు తట్టిన శబ్దం వినిపించడంతో ఆ మహిళ ఇంటికి ఎవరో వచ్చారని వెళ్లి చూసింది. అక్కడ ఆమె బంగారం, డబ్బుతో ఉన్న పోలీసులను చూసి ఒక్కసారిగా కంగారుపడింది. అసలు వాళ్లు ఎందుకొచ్చారో ఆమెకు అర్ధం కాలేదు.. ఈ ఘటన నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఆ కథేంటంటే.?
వివరాల్లోకి వెళ్తే.. రెండు నెలల క్రితం నాగ్‌పూర్‌లోని జరీపట్కా ప్రాంతానికి చెందిన జానకి అనే మహిళ ఇంట్లో నలుగురు దొంగలు రూ. 1.25 లక్షల క్యాష్, 18 తులాల బంగారాన్ని దొంగలించారు. ఆ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు ఇచ్చిన కంప్లయింట్ మేరకు కేసు నమోదు చేసిన ఖాకీలు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముంబైకి చెందిన నలుగురు దొంగలు ఈ దొంగతనానికి పాలపడ్డారని తెలుసుకున్నారు. పక్కా ప్రణాళికను రచించిన ఆ దొంగలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు పోలీసులు.
ఈ దొంగలు జనవరి 2021 నుంచి 2022 జూన్ వరకు పలు ప్రాంతాల్లో దోపిడీలు చేసి సుమారు రూ. 68 కోట్లు కొల్లగొట్టారని పోలీసుల విచారణలో తేలింది. ఆ డబ్బుంతా స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దాన్ని తిరిగి బాధితులకు అందజేశారు. ఈ క్రమంలోనే జానికి ఇంటికి స్వయంగా నాగ్‌పూర్ డీసీపీ వెళ్లి డబ్బు, ఆభరణాలను అందజేశారు. పోగొట్టుకున్న సొమ్ము మళ్లీ తిరిగి రావడంతో సదరు యువతి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..