Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weird Creature: కాఫీ షాప్ దగ్గర వింత జీవి.. 500 కాళ్లు, కళ్లు కనిపించని ఈ జీవిపై శాస్త్రవేత్తల పరిశోధన..

కొత్త వస్తువు కనిపించినా, కొత్త జీవి కనిపించినా ప్రజలు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇప్పటి వరకూ మేము ఇలాంటి జీవిని చూడలేదని అనుకుంటారు. అటువంటి వింత, మర్మమైన జీవి ఒకటి ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది. ఈ మర్మమైన జీవికి దాదాపు 500 కాళ్లు ఉన్నాయి.. అంతేకాదు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. దీనికి కళ్లు లేవు. 

Weird Creature: కాఫీ షాప్ దగ్గర వింత జీవి.. 500 కాళ్లు, కళ్లు కనిపించని ఈ జీవిపై శాస్త్రవేత్తల పరిశోధన..
Los Angeles Thread Milliped
Follow us
Surya Kala

|

Updated on: Jul 29, 2023 | 2:35 PM

భూమి, అంతరిక్షం, సముద్ర  సమస్తం ఎన్నో రహస్యాలతో నిండి  ఉంటుంది. కొన్ని సృష్టి రహస్యాల గురించి ఇప్పటి వరకు ఎవరూ తెలుసుకోలేకపోయారు. అటువంటి పరిస్థితిలో, కొత్త వస్తువు కనిపించినా, కొత్త జీవి కనిపించినా ప్రజలు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇప్పటి వరకూ మేము ఇలాంటి జీవిని చూడలేదని అనుకుంటారు. అటువంటి వింత, మర్మమైన జీవి ఒకటి ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది. ఈ మర్మమైన జీవికి దాదాపు 500 కాళ్లు ఉన్నాయి.. అంతేకాదు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. దీనికి కళ్లు లేవు.

మిర్రర్ నివేదిక ప్రకారం శాస్త్రవేత్తలు ఈ వింత జీవిని అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లోని ఓ కాఫీ షాప్ కింద కనుగొన్నారు. దాదాపు 4 అంగుళాల పొడవున్న ఈ జీవికి ‘లాస్ ఏంజెల్స్ థ్రెడ్ మిల్లిపాడ్’ అని పేరు పెట్టారు. శాస్త్రవేత్తలు ఈ జీవి పాదాలను మొదటిసారి చూసినప్పుడు అవి 500 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఇవి ఎగిరిపోయాయి కూడా.. తర్వాత ఈ జీవి DNA ద్వారా ఏ జాతికి చెందింది అనే విషయాన్ని గుర్తించడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. ఇది మిల్లిపేడ్ కి చెందిన కొత్త జాతి అని కనుగొన్నారు. ఇలాంటి జీవిని ఇప్పటివరకు మానవులు చూడలేదు.

పారదర్శకంగా ఉన్న వింత జీవి నివేదికల ప్రకారం ఈ జీవి చూడటానికి చాలా సన్నగా ఉంది. అంటే పెన్సిల్ కొన వలె ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ జీవి పారదర్శకంగా కనిపిస్తుంది. జెల్లీ ఫిష్‌ ఎలా పారదర్శకంగా ఉంటాయో, అదే విధంగా ఈ జీవి కూడా పారదర్శకంగా ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. అంతేకాదు తమ పరిశోధనలో ఈ జీవి గుడ్డిదని కనుగొన్నారు. శాస్త్రవేత్తలు ఈ జీవి బృందాన్ని అన్వేషించే పనిలో నిమగ్నమై ఉన్నారు. అయితే  ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సాధారణంగా దట్టమైన అడవులలో మాత్రమే ప్రత్యేకమైన జీవి కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇలాంటి వింత జీవి శాస్త్రవేత్తలు కనుగొనడం ఇదే మొదటి సారి కాదు. గతేడాది  శాస్త్రవేత్తల అన్వేషణలో సముద్రపు లోతుల్లో 35కు పైగా వింత జాతులను కనుగొన్నారు. అందులో కొత్త జాతుల స్టార్ ఫిష్  వంటివి అనేకం ఉన్నాయి.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌