చాలామందికి రోజులో కనీసం ఒక్కసారైన టీ లేదా కాఫీ తాగకుండా ఉండలేరు. అందుకే ఈ మధ్య టీ షాపులకి కూడా మంచి గిరాకీ వస్తోంది. అంతేకాదు టీ షాప్ నిర్వాహకులు కూడా కస్టమర్లను ఆకర్షించేందుకు రకరకాల పద్ధతులను అనుసరిస్తున్నారు. ఎంబీఏ చాయివాలా, గ్రాడ్యుయేట్ చాయివాలా , చాయ్ జీపీటీ అంటూ విభిన్న పేర్లు పెట్టి కస్టమర్లు తమ టీ తాగివెళ్లేలా చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా అదే వరుసలో ఆడీచాయివాలా వచ్చేసింది. ముంబయిలోని అమిత్ కశ్యప్, మన్ను శర్మ అనే ఇద్దరు స్నేహితులు ఆడికార్లో వచ్చి టీ అమ్ముతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
లోకంద్‌వాలా బ్యాక్‌రోడ్‌లోని ప్రతిరోజు వీరు ఆడి కార్లో వచ్చి రోడ్డు పక్కనే తమ టీ షాప్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దారిన పోయే చాలామంది అక్కడ టీ తాగి వెళ్తున్నారు. ఓ వ్యక్తి వాళ్లు టీ అమ్ముతున్న వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. రోడ్డు పక్కన ఓ వ్యక్తి ఆడీ కారులో టీ అమ్ముతున్నాడని క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. చాలామంది నెటీజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆ టీ అమ్ముతున్న వ్యక్తికి నేను సెల్యుట్ చేస్తున్నానని ఓ యూజర్ కామెంట్ చేయగా.. ఏ వ్యాపారం కూడా చిన్న వ్యాపారం కాదని హర్డ్‌వర్క్‌ను గౌరవించాలని మరో యూజర్ కామెంట్ చేశాడు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..