Mumbai Cop: ఈ పోలీసు అధికారి టాలెంట్ చూస్తే ఫిదా అయిపోవాల్సిందే.. నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న వీడియో..

|

Aug 06, 2021 | 2:10 PM

Mumbai Cop: టాలెంట్ ఎవరి సొత్తు కాదు. ప్రతీ ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది. అది గుర్తిస్తే.. ప్రతీ ఒక్కరూ సెలబ్రిటీలే. అయితే, తమలోని

Mumbai Cop: ఈ పోలీసు అధికారి టాలెంట్ చూస్తే ఫిదా అయిపోవాల్సిందే.. నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న వీడియో..
Mumbai Cop
Follow us on

Mumbai Cop: టాలెంట్ ఎవరి సొత్తు కాదు. ప్రతీ ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది. అది గుర్తిస్తే.. ప్రతీ ఒక్కరూ సెలబ్రిటీలే. అయితే, తమలోని ప్రతిభను గుర్తించిన వారు.. పాపులర్ అవుతున్నారు. గుర్తించని వారు అలాగే ఉండిపోతున్నారు. కొందరు టాలెంట్ ఉండి కూడా నచ్చిన పనిలో కాకుండా.. వేరే వృత్తిలో రాణిస్తున్న వారు కూడా ఉన్నారు. దీనికి నిదర్శనమైన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో సంచలనంగా మారింది.

అమోల్ యశ్వంత్ కాంబ్లే.. ముంబై పోలీసు డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఈ 38 ఏళ్ల పోలీస్ కానిస్టేబుల్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. డ్యూటీ ముగిశాక ఆఫ్ డేస్‌లో డ్యాన్స్ చేసే కాంబ్లే.. నైగావ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే తాజాగా కాంబ్లే.. ‘అప్పు రాజా’ సినిమాలోని ‘ఆయా హై రాజా’ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులేశాడు. ఈ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. పోలీసు అధికారి డ్యాన్స్ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

అయితే ఈ వీడియోపై కాంబ్లే స్పందించారు. వీడియో చేయడం వెనుక సామాజిక ధృక్కోణం ఉందని కాంబ్లే చెప్పుకొచ్చారు. ‘విధుల్లో ఉన్న పోలీసు ఉద్యోగి.. మాస్క్ ధరించిన ద్విచక్ర వాహనదారుడికి మాస్క్ ధరించమని చెప్పే థీమ్‌తో ఈ డ్యాన్ చేశాం. దానిని ఉద్దేశించి ఇద్దరం కలిసి డ్యాన్స్ చేశాం’ అని చెప్పుకొచ్చారు.

2004లో పోలీస్ ఉద్యోగంలో చేరిన కాంబ్లేకి చిన్నప్పటి నుంచే డ్యాన్స్‌పై మక్కువట. ‘నా అన్నయ్య కొరియోగ్రాఫర్, నేను పోలీసు ఉద్యోగంలో చేరడానికి ముందు అతనితో కలిసి కొన్ని డ్యాన్స్ షో లు కూడా చేశాను. ఒక పోలీసుగా శాంతిభద్రతలను కాపాడటం, పౌరులను రక్షించడం నా ప్రథమ కర్తవ్యం. కానీ వీక్లీ ఆఫ్‌ సమయాల్లో నా పిల్లలు, నా సోదరి పిల్లలతో కలిసి ఇలా నృత్యం చేస్తుంటాను.’ అని కాంబ్లే పేర్కొన్నారు.

‘ఈ డ్యాన్స్ వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాండ్స్ వస్తుంది. నెటిజన్లు చేసే కామెంట్స్ నాకు సంతోషాన్ని కలిగిస్తాయి. నా డ్యాన్స్ వారికి స్ఫూర్తిగా ఉంటుందని చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటారని, అలాంటివి చూసినప్పుడు ఎగ్జైటింగ్‌గా అనిపిస్తుందన్నారు. ప్రజలు తమకు ఇష్టమైన పనులు చేస్తుండగా.. ఉరుకులు పరుగుల జీవితంలో.. ఆనందానికి కూడా కొంత సమయాన్ని వెచ్చించాలి’ అని కాంబ్లే చెప్పుకొచ్చారు.

ఇదిలాఉంటే.. కొన్ని నెలల క్రితం ఢిల్లీకి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు డ్యూటీ టైమ్‌లో ఫన్నీ వీడియోలు చేసి సస్పెన్షన్‌కు గురయ్యారు. ఢిల్లీకి చెందిన ఓ పురుష, మహిళా కానిస్టేబుల్.. ‘తుకూర్ తుకూర్ దేఖ్తే హో క్యా’ అనే బాలీవుడ్ పాటకు యాక్టింగ్ చేశారు. అయితే, ఆ సమయంలో వారిద్దరూ యూనిఫామ్ వేసుకుని డ్యూటీలో ఉన్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అవి కాస్తా గంటల్లోనే వైరల్ అయ్యాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ఆ ఇద్దరు కానిస్టేబుళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. హెడ్ కానిస్టేబుల్ శశి, కానిస్టేబుల్ వివేక్ మాథూర్‌ను సస్పెండ్ చేశారు.

Viral Video:

Also read:

Kurnool: మంత్రాలయంలో వింత ఘటన.. ఆవు దూడకు కడుపు నిండా పాలు ఇచ్చిన సునకం..

Andhra Pradesh: మహిళపై ఆటో డ్రైవర్ దాష్టికం.. ఇచ్చిన బాకీ అడిగినందుకు దారుణానికి ఒడిగట్టారు..

Prakasham: హిజ్రాతో సహజీవనం చేస్తూ మరో పెళ్లికి సిద్ధపడ్డ ఆర్మీ ఉద్యోగి.. విషయం తెలిసిన యువతి ఏం చేసిందంటే..