Viral: ఎయిర్‌పోర్ట్‌లో సాధారణ తనిఖీలు.. స్కానర్‌లో దొరికిన అనుమానాస్పద పార్శిల్.. తెరిచి చూడగా.!
కొలంబో నుంచి ఇండియా వస్తోన్న ఓ వ్యక్తిని.. ఎయిర్‌పోర్ట్‌లో ఒక అపరిచిత వ్యక్తి పరిచయం చేసుకుని.. ఓ పార్శిల్ ముంబై చేర్చాలని విజ్ఞప్తి చేశాడు. ల్యాండ్ అయిన వెంటనే తన మనిషి మిమ్మల్ని గుర్తుపట్టి.. పార్శిల్ తీసుకుంటాడని బాధితుడికి చెప్పాడు. నార్మల్ పార్శిలే కదా అని సదరు వ్యక్తి దాన్ని తీసుకుని విమానమెక్కాడు.

కొలంబో నుంచి ఇండియా వస్తోన్న ఓ వ్యక్తిని.. ఎయిర్‌పోర్ట్‌లో ఒక అపరిచిత వ్యక్తి పరిచయం చేసుకుని.. ఓ పార్శిల్ ముంబై చేర్చాలని విజ్ఞప్తి చేశాడు. ల్యాండ్ అయిన వెంటనే తన మనిషి మిమ్మల్ని గుర్తుపట్టి.. పార్శిల్ తీసుకుంటాడని బాధితుడికి చెప్పాడు. నార్మల్ పార్శిలే కదా అని సదరు వ్యక్తి దాన్ని తీసుకుని విమానమెక్కాడు. ఫ్లైట్ ముంబై ఎయిర్‌పోర్ట్ చేరుకుంది. ఇక కస్టమ్స్ అధికారుల గ్రీన్ ఛానెల్ తనిఖీల్లో.. ఆ ప్రయాణీకుడిని ఆపారు. ఆ అనుమానాస్పద పార్శిల్‌ను ఓపెన్ చేసి చూడగా..!
వివరాల్లోకి వెళ్తే.. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు కొలంబో నుంచి భారత్ వచ్చిన ఓ ప్రయాణీకుడి నుంచి సుమారు రూ. 1.64 కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ పార్శిల్ తనది కాదని.. కొలంబో ఎయిర్‌పోర్ట్‌లో ఓ అజ్ఞాత వ్యక్తి.. భారత్‌లో తనకు సంబంధించిన వేరే వ్యక్తికి అందజేయాలంటూ అభ్యర్ధించాడని సదరు బాధితుడు అధికారులకు జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చాడు.
అసలు జరిగిన స్టోరీ ఇది..
శనివారం శ్రీలంక ఎయిర్‌లైన్స్ ద్వారా కొలంబో నుంచి కమాలుద్దీన్ అనే ప్రయాణీకుడు ముంబై చేరుకున్నాడు. ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో సదరు ప్రయాణీకుడు.. అనుమానాస్పద కదలికలు కారణంగా దొరికిపోయాడు. అతడి లగేజ్ సోదా చేయగా.. ఆరు పౌచ్‌ల 2,935 గ్రాముల బరువు కలిగిన 24 క్యారెట్ల బంగారం డస్ట్ దొరికింది. దాని ప్రస్తుత మార్కెట్ విలువ రూ.1.64 కోట్లు ఉంటుందని అంచనా. దేశంలోకి అక్రమంగా బంగారం రవాణా చేస్తున్నట్టు అతడిపై కేసు నమోదు చేశారు అధికారులు. అయితే కమాలుద్దీన్.. సదరు పార్శిల్ తనకు ఎవరో అజ్ఞాత వ్యక్తి ఇచ్చాడని చెప్పడంతో.. ఆ మేరకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు కస్టమ్స్ అధికారులు.