నువ్వు సూపర్‌ బ్రో.. ఇలాంటి ఐడియా ఎలా వచ్చింది భయ్యా.. ఏకంగా షాపింగ్‌ మాల్‌లోనే..

దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఢిల్లీ, ముంబైలో వాయు కాలుష్యం తీవ్రమవుతోంది. ముంబైలో AQI 300 దాటి, ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి, బహిరంగ ప్రదేశాల్లో జాగింగ్ చేయకుండా ఒక యువకుడు మాల్‌లో పరుగెడుతున్న వీడియో వైరల్ అయ్యింది. నిర్మాణ పనులు, వాహన కాలుష్యం వంటివి ఈ సంక్షోభానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఇది నగరాలకు పెను సవాల్.

నువ్వు సూపర్‌ బ్రో.. ఇలాంటి ఐడియా ఎలా వచ్చింది భయ్యా.. ఏకంగా షాపింగ్‌ మాల్‌లోనే..
Mumbai Air Pollution Crisis

Updated on: Jan 07, 2026 | 1:28 PM

దేశవ్యాప్తంగా కాలుష్యం కొరలు చాస్తోంది. దేశరాజధాని ఢిల్లీలో అయితే, ప్రజలు ఊపిరి బిగబట్టుకుని బతకాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఇదే పరిస్థితి అనేక ప్రధాన నగరాల్లోనూ కనిపిస్తోంది. ఢిల్లీ తరువాత ముంబైని సైతం కాలుష్య భూతం కబలించేందుకు దూసుకువస్తోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ముంబైలోనూ వాతావరణం మారిపోతోంది. ముంబైలో అధిక వాయు కాలుష్యం, వాహన శబ్ధాలు, దుమ్ముదూళి కారణంగా ప్రజలు ఇళ్లనుంచి బయటకు వచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారు. మార్నింగ్‌ జాగింగ్‌ వంటివి చేసే వాళ్లకు మరింత కష్టం అవుతోంది. ఈ క్రమంలోనే ముంబైకి చెందిన ఒక వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది.

సోషల్ మీడియాలో ట్రాక్ పై పరిగెత్తకుండా మాల్ లో జాగింగ్ చేస్తున్న యువకుడి వీడియో వైరల్ గా మారింది. ఢిల్లీ అంత దారుణంగా లేకపోయినా, ముంబైలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరుగుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 200 మార్కును దాటింది. ఈ నేపథ్యంలోనే ట్రాక్ పై పరిగెత్తకుండా మాల్ లో జాగింగ్ చేస్తున్న యువకుడి వీడియో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

ఈ వైరల్ క్లిప్‌ను భవిన్ పర్మార్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అందులో, టీ-షర్ట్, ట్రాక్ ప్యాంట్, స్పోర్ట్స్ షూస్ ధరించిన ఒక యువకుడు మాల్‌ను తన సొంత జాగింగ్ ట్రాక్‌గా మార్చేసుకోవటం కనిపిస్తుంది. బాహశ మాల్‌లో జాగింగ్ చేస్తే లోపల గాలి శుభ్రంగా ఉంటుంది. చుట్టుపక్కల ప్రాంతం కూడా పరిశుభ్రంగా ఉంటుంది. AC వల్ల ఎటువంటి సమస్య లేదు. కాబట్టి, అతడు మాల్‌ని తన జాగింగ్‌ ట్రాక్‌గా మార్చుకున్నాడని అనిపిస్తుంది.

ఈ వీడియో జనవరి 05న సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడింది. దీనికి ఆన్‌లైన్‌లో మంచి ఆదరణ లభించింది. దీనికి 2.94 లక్షల వ్యూస్ వచ్చాయి. దీనికి 6,600 లైక్స్ వచ్చాయి.

గాలి కాలుష్యం నుండి తప్పించుకోవడానికి అతడు ఎవరికీ రాని ఆలోచన చేశాడు. ఇది బెస్ట్‌ ఐడియా అంటూ చాలా మంది నెటిజన్లు హ్యాపీ కామెంట్స్‌ చేశారు. జనవరి 7మార్నింగ్‌ ముంబై నగరం మొత్తం గాలి నాణ్యత సూచిక 332కి చేరుకుంది. దీనిని తీవ్రమైనదిగా వర్గీకరించారు. పిల్లలు, సీనియర్ సిటిజన్లు, శ్వాసకోశ, గుండె జబ్బులతో బాధపడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి…

మెట్రో రైలు కారిడార్లు, ఫ్లైఓవర్లు, తీరప్రాంత రోడ్ల విస్తరణలు, రోడ్డు విస్తరణ పనులు వంటి కొనసాగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా దుమ్ముదూళి విపరీతంగా పెరిగిపోతోంది. ప్రైవేట్ రియల్ ఎస్టేట్ నిర్మాణం కాలుష్య కారకాల భారాన్ని మరింత పెంచింది. ముఖ్యంగా రద్దీ సమయాల్లో వాహనాల నుండి వచ్చే ఉద్గారాలు పరిస్థితిని రెట్టింపు తీవ్రతరం చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే గాలి నాణ్యత నిర్వహణ నగరానికి ప్రధాన సవాలుగా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..