Watch Video: పోలీస్‌ అంకుల్‌.. మా నాన్నను జైల్లో వేయండి! ఐదేళ్ల బాలుడి ఫిర్యాదు.. వీడియో వైరల్

|

Aug 20, 2024 | 7:16 PM

ఐదేళ్ల బాలుడు తన తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీస్‌ అధికారి ఎదురుగా కూర్చిలో కూర్చుని ఏడుస్తూ కంప్లైట్‌ చేశాడు..దానికి ఏం జరిగిందని పోలీసులు ఆరా తీయగా.. తన తండ్రి ఇక్బా్ల్ పై ఫిర్యాదు చేయడానికి వచ్చానని చెప్పాడు బుడ్డొడు. నాన్నపై ఎందుకు కేసు పెడుతున్నావని అడిగితే..ఏడుస్తూ తన తండ్రి..

Watch Video: పోలీస్‌ అంకుల్‌.. మా నాన్నను జైల్లో వేయండి! ఐదేళ్ల బాలుడి ఫిర్యాదు.. వీడియో వైరల్
Child Complains His Father
Follow us on

సోషల్‌ మీడియాలో ఓ బుడ్డొడి వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఓ చిన్నారి తన నాన్నపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. నాన్న నన్ను రోజు కొడుతున్నాడని, అందుకే మా నాన్నను జైల్లో పెట్టాలంటూ పోలీసులకు కంప్లైట్‌ చేశాడు. ఆ పిల్లాడు, ఓ పోలీసు అధికారి మధ్య పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన సంభాషణ అంతా వీడియో తీసిన వారు సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మధ్యప్రదేశ్ లో జరిగింది ఈ విచిత్ర సంఘటన. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో హసనైన్ అనే ఐదేళ్ల బాలుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఇలా ఫిర్యాదు చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో హసనైన్ అనే ఐదేళ్ల బాలుడు తన తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీస్‌ అధికారి ఎదురుగా కూర్చిలో కూర్చుని ఏడుస్తూ కంప్లైట్‌ చేశాడు..దానికి ఏం జరిగిందని పోలీసులు ఆరా తీయగా.. తన తండ్రి ఇక్బా్ల్ పై ఫిర్యాదు చేయడానికి వచ్చానని చెప్పాడు బుడ్డొడు. నాన్నపై ఎందుకు కేసు పెడుతున్నావని అడిగితే..ఏడుస్తూ తన తండ్రి రోజూ కొడుతున్నాడని, తన ఇంటి దగ్గర ఉన్న నది వద్దకు పోనివ్వడం లేదని, రోడ్డు వైపు వెళ్లొద్దని ఆపుతున్నాడంటూ క్యూట్ గా చెప్పాడు. తన రిపోర్టు రాసుకుని నాన్నను జైళ్లో పెట్టాలని కోరాడు. దీనికి ఆ పోలీస్ అధికారి స్పందిస్తూ.. ఇక్బాల్ పై రిపోర్ట్ రాసుకున్నానని, అతన్ని తీసుకొచ్చి జైల్లో పెడతానని హామీ ఇవ్వడంతో పోలీస్ స్టేషన్ నుంచి వెనుదిరిగాడు ఆ బాలుడు.

ఇవి కూడా చదవండి

ఈ సంఘటనను ఓ అధికారి తన సెల్‌ఫోన్‌లో రికార్డ్‌ చేశాడు. అనంతరం వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. చిన్నారి ధైర్యానికి ఫిధా అయినా నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..