Viral Video: నదిలోని నీళ్లపై రయ్‌మని దూసుకెళ్లిన దుప్పి.. దైవమా? దయ్యమా? అంటూ షాక్ అవుతున్న నెటిజన్లు..!
Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ఫన్నీ వీడియోలకు కొదవే లేదు. ప్రతీ రోజూ ప్రపంచ నలు మూలల చోటు చేసుకున్న ఆసక్తికర, హాస్యాత్మక, ఆశ్చర్యాత్మక సంఘటనకు
Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ఫన్నీ వీడియోలకు కొదవే లేదు. ప్రతీ రోజూ ప్రపంచ నలు మూలల చోటు చేసుకున్న ఆసక్తికర, హాస్యాత్మక, ఆశ్చర్యాత్మక సంఘటనకు సంబంధించి వీడియోలు ఎన్నో పోస్ట్ చేస్తుంటారు.. అవి వైరల్ అవుతుంటాయి. తాజాగా మనుషులను సంభ్రమాశ్చర్యానికి గురి చేసే వీడియో ఒకటి నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో దుప్పి పరుగెత్తిన విధానం చూసి దయ్యామా? దైవమా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.
రామాయణంలో సీతాదేవికి కినిపించిన మాయ జింక మాదిరిగా.. ఇక్కడ కూడా ఓ దుప్పి అందరినీ షాక్‌కు గురి చేసింది. సాధారణంగా నీటిలోకి అడుగు పెడితే ఎం జరుగుతుంది? ఆ కాళ్లు నీల్లలోకి మునుగుతాయి. మరి లోతైన నదిలోకి దిగితే? మొత్తం మునిగిపోతారు. ఈత వస్తే ఈదుతారు. మరి.. నది జలాలపై పరుగెత్తగలరా? కానీ, ఇక్కడ ఓ దుప్పి.. నదీ జలాలపై రయ్ మంటూ పరుగులు తీసింది. అవుతున్న మీరు విన్నది నిజమే. క్షణాల్లో చోటు చేసుకున్న ఈ ఘటనను చూసిన కొందరు షాక్ అయ్యారు. దుప్పి నీటిపై పరుగెత్తే సన్నివేశం పర్యాటకుల కెమెరాలో రికార్డ్ అవడంతో.. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది. దుప్పి నీటిపై ఎలా పరుగెడుతుందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియోలో ఏముందంటే.. నదిలో పడవ వేగంగా వెళుతోంది. ఇంతలో వచ్చిన ఓ దుప్పి.. నీటిపై పరుగులు తీస్తూ దూసుకెళ్లింది. పడవలోని ప్రయాణికులు ఆ దృశ్యాన్ని చూసి విస్తుపోయారు. వెంటనే తమ వెంట తీసుకువచ్చిన కెమెరాలకు పని చెప్పి వీడియో చిత్రీకరించారు. 11 సెకన్ల పాటు ఉన్న వీడియోను చూసి నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు. ఇది కలా, నిజమా అని సందేహపడుతున్నారు. ఈ షాకింగ్ వీడియోను ocean.forever అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో షేర్ చేశారు. ‘నీటిపై నడుస్తున్న దుప్పి’ అని క్యాప్షన్ పెట్టారు. కాగా, ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఫేక్ అని కొందరు అంటుంటే.. ఇది సాధ్యమే అని మరికొందు అభిప్రాయపడుతున్నారు.
View this post on Instagram
Also read:
Children Fear: కొత్తవారంటే పిల్లలు ఎందుకు భయపడుతుంటారు..? చైల్డ్ సైకాలజీ నిపుణులు ఏమంటున్నారంటే..!
Kishmish Benefits: ఎండుద్రాక్షతో అదిరిపోయే బెనిఫిట్స్.. ఆ విషయంలో పిల్లలకు ఎంతో ఉపయోగం..!