Viral Video: రామ్..రామ్ అంటూ రామకోటి రాస్తున్న కోతి.. వైరలవుతున్న వీడియో.. చూస్తే అవాక్కే!
ఇది చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు. రామ భక్తిని చూసి పరవశించి పోతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో..ఒక కోతి వేరుశెనగ కాయలతో 'రామ్' అనే పేరు రాస్తూ కనిపిస్తుంది.
ఆ శ్రీరాముడిని పురుషోత్తముడిగా కొలుస్తారు భక్తులు. మహావిష్ణువు అవతారంగా భావించే శ్రీరామునికి సంబంధించిన కథలు ప్రపంచం మొత్తానికి తెలుసు. రాక్షస సంహారం కోసం మానవ రూపంలో జన్మించాడు. రావణుడితో జరిగిన యుద్ధంలో వానర సైన్యం అతనికి మద్దతు ఇచ్చింది. ఆ విధంగా ఇప్పటికీ కోతులను రామభక్తుడు హనుమంతుడిగా పూజనీయంగా భావిస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక కోతి వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు. రామ భక్తిని చూసి పరవశించి పోతారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో..ఒక కోతి వేరుశెనగ కాయలతో ‘రామ్’ అనే పేరు రాస్తూ కనిపిస్తుంది. ఇప్పుడు కోతులకు చదవడం, రాయడం తెలియదని, మరి ఈ కోతి ‘రామ్’ అని ఎలా రాస్తోందో ఈ దృశ్యాన్ని చూసి జనాలు షాక్ అవుతున్నారు. వీడియో చూసిన కొంతమంది నెటిజన్లు దీనిని ఒక అద్భుతంగా పరిగణిస్తున్నారు. కానీ, వాస్తవానికి ఇక్కడ జరిగిన నిజం మరొకటి ఉంది. అది తెలిస్తే మీరు కూడా ఖచ్చితంగా విస్తుపోతారు.
నిజానికి కోతి ‘రామ్’ అని రాయడం వెనుక నిజం ఏంటంటే.. వీడియో రివర్స్ అయింది. కోతి ‘రామ్’ అనే పేరు రాయడం లేదని, అయితే అప్పటికే ‘రామ్’ అనే పేరు రాసి ఉందని, కోతి ఆ వేరుశెనగలను ఒక్కొక్కటిగా తొలగిస్తోందని తెలిసి వినియోగదారులు వాపోతున్నారు.
कोई जबरदस्ती नहीं है, जिसका दिल करे सिर्फ वहीं “जय श्री राम” लिखें⛳?https://t.co/pFEHuxxGsG pic.twitter.com/utuVqDss5R
— Amar Bajpai?? (@Amarbajpai100) December 17, 2022
అయితే, వీడియోని రివర్స్‌లో చూస్తే మాత్రం…కోతి వేరుశనగలతో ‘రామ్’ అని రాస్తున్నట్టు అద్భుతంగా కనిపింస్తుంది. ఏదీ ఏమైనా కావచ్చు, కానీ ఈ వీడియో మాత్రం భక్తుల హృదయాల్ని సంతోషపరుస్తుంది.
ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @Amarbajpai100 అనే IDతో షేర్ చేశారు. కేవలం 39 సెకన్ల ఈ వీడియోను ఇప్పటి వరకు 24 వేలకు పైగా వీక్షించగా, 4 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి భిన్నమైన రియాక్షన్స్ ఇచ్చారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి