AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: పెళ్లి మండపంపై వధూవరుల డ్యాన్స్‌ స్టెప్పులు.. ‘ నవ్వలేక చచ్చిపోతున్నాం’ అంటున్న నెటిజన్లు.. వైరల్ అవుతున్న వీడియో..

కొన్నేళ్ల క్రితం వరకు కూడా చాలా మంది పెళ్లి అంటే ఏదో తెలయని సంకోచంతో ఉండేవారు. కానీ ప్రస్తుత కాలంలో వారు ఏకంగా వివాహ మండపాలపైనే డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా ఇది..

Watch Video: పెళ్లి మండపంపై వధూవరుల డ్యాన్స్‌ స్టెప్పులు.. ‘ నవ్వలేక చచ్చిపోతున్నాం’ అంటున్న నెటిజన్లు.. వైరల్ అవుతున్న వీడియో..
Bride And Groom Dance
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 17, 2022 | 8:25 PM

Share

ఈ మధ్య సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో వివాహ వేడుకలకు సంబంధించినవి, ఇంకా ఆ సందర్భంగా వధూవరులు చేసే డాన్స్ వీడియోలు కూడా ఉంటూనే ఉన్నాయి. ఇక ఈ వివాహ వీడియోలను అయితే నెటిజన్లు ప్రత్యేక ఆసక్తితో వీక్షిస్తుంటారు. అవి వైరల్ కావడానికి ఆ ప్రత్యేక ఆసక్తే కారణం. కొన్నేళ్ల క్రితం వరకు కూడా చాలా మంది పెళ్లి అంటే ఏదో తెలయని సంకోచంతో ఉండేవారు. కానీ ప్రస్తుత కాలంలో వారు ఏకంగా వివాహ మండపాలపైనే డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా ఇది చాలా సాధారణ విషయంగా మారిపోయింది అని కూడా చెప్పుకోవాలి. పెళ్లిలో వరుడి కోసం వధువు డ్యాన్స్ చేస్తున్న వీడియోలను మీరు చాలాసార్లు చూసే ఉంటారు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు.

అయితే ఈ వీడియో ప్రత్యేకత ఏమంటే ఈ వీడియోలో వధువుతో పాటు వరుడు కూడా డ్యాన్స్ చేస్తాడు. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలకు ఇది చాలా భిన్నంగా ఉంది.  పెళ్లికూతురు తనను చూసిన తర్వాత కొన్ని సెకన్ల పాటు డ్యాన్స్ చేస్తుందని వరుడు భావించాడు. కానీ ఆమె ప్రారంభించిన తర్వాత ఇక ఆపకుండా డ్యాన్స్ చేస్తూనే ఉంది. దీంతో వరుడు కూడా ఊపందుకుని కాలు కదిపాడు. ఇక ఇద్దరూ ఒకే సమయంలో ఒకే మ్యూజిక్‌కు వేర్వేరు స్టెప్పులు వస్తూ అందరినీ నవ్వించారు. కానీ కాసేపటి తర్వాత వరుడి బ్యాటరీ డౌన్ అయిపోయి పక్కకు వెళ్లి కూర్చున్నాడు.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరల్ అవుతున్న వీడియోను ఇక్కడ చూడండి..

అలా సాగిన ఈ వీడియోను ట్విట్టర్‌లోని @anamika943 అనే ఖాతాదారు షేర్ చేశారు. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు 2 లక్షల 25వేలకుపై మంది  వీక్షించగా, 6 వేల వరకూ లైకులు వచ్చాయి. ఇంకా నెటిజన్లు కూడా ఈ వీడియోకు చాలా సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఒక నెటిజన్ అయితే ‘ఈ వీడియో చూసిన తర్వాత నేను వరుడిపై జాలిపడుతున్నాను’ అరి రాయగా, మరో నెటిజన్ ‘టిక్ టాక్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల కలిగే ఫలితం’ అని రాసుకొచ్చాడు. ఇలా నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ ద్వారా తెలియజేస్తున్నారు.

రైళ్లలో తెల్లటి బెడ్‌షీట్లే ఎందుకు ఇస్తారో తెలుసా..? ఆ రహస్యం..
రైళ్లలో తెల్లటి బెడ్‌షీట్లే ఎందుకు ఇస్తారో తెలుసా..? ఆ రహస్యం..
లైవ్ మ్యాచ్‌లో వికెట్ కీపర్ సెలబ్రేషన్ చూస్తే నవ్వాపుకోలేరంతే..!
లైవ్ మ్యాచ్‌లో వికెట్ కీపర్ సెలబ్రేషన్ చూస్తే నవ్వాపుకోలేరంతే..!
నారీ నారీ నడుమ మురారి సినిమాను మిస్ అయిన హీరో ఎవరంటే..
నారీ నారీ నడుమ మురారి సినిమాను మిస్ అయిన హీరో ఎవరంటే..
వందే భారత్ స్లీపర్ రైళ్లలో కొత్త లగేజీ రూల్స్.. ఆ పరిమితి దాటితే.
వందే భారత్ స్లీపర్ రైళ్లలో కొత్త లగేజీ రూల్స్.. ఆ పరిమితి దాటితే.
పగడపు రత్నం: ఇది మీ జీవితం మార్చేస్తుంది.. కానీ ఈ తప్పు చేస్తే..?
పగడపు రత్నం: ఇది మీ జీవితం మార్చేస్తుంది.. కానీ ఈ తప్పు చేస్తే..?
చలికాలంలో రోజుకు ఎన్ని కప్పుల చాయ్ తాగాలి.. ఎక్కువ తాగితే..
చలికాలంలో రోజుకు ఎన్ని కప్పుల చాయ్ తాగాలి.. ఎక్కువ తాగితే..
బరువు తగ్గడానికి భోజనం మానేస్తున్నారా..?మీరు డేంజర్‌లో పడినట్టే!
బరువు తగ్గడానికి భోజనం మానేస్తున్నారా..?మీరు డేంజర్‌లో పడినట్టే!
నమ్మకంతో చోటిస్తే, నట్టేట ముంచేసిన టీమిండియా ప్లేయర్..?
నమ్మకంతో చోటిస్తే, నట్టేట ముంచేసిన టీమిండియా ప్లేయర్..?
వెంకటేష్‌తో సినిమా చేయకపోవడానికి కారణం అదే.!
వెంకటేష్‌తో సినిమా చేయకపోవడానికి కారణం అదే.!
దుర్గమ్మ భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఆ కాల్స్ పట్ల జాగ్రత్త..
దుర్గమ్మ భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఆ కాల్స్ పట్ల జాగ్రత్త..