Viral Video: మామ ఏక్ పెగ్ లా.. చివరికి కోతులు కూడా..

బ్రెజిల్‌కి సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఒక కోతి చెత్త నుండి బీర్ బాటిల్‌ను తీసి, మిగిలిన ఆల్కహాల్‌ను సిప్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఒక చెత్త కుండీపై కూర్చున్న రెండు కోతులు చేసిన ఈ పని అందర్నీ ఆకట్టుకుంటుంది. చెత్త బిన్‌పై కూర్చున్నా రెండు కోతులు బీరు తాగడం అందర్నీ ఆశ్యర్యానికి గురిచేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెటింట్లో చక్కర్లు కొడుతుంది. బ్రెజిల్‌లోని పరానాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Viral Video: మామ ఏక్ పెగ్ లా.. చివరికి కోతులు కూడా..
Monkey Pulls Out Beer
Follow us

|

Updated on: Oct 14, 2024 | 8:15 PM

బ్రెజిల్‌కి సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఒక కోతి చెత్త నుండి బీర్ బాటిల్‌ను తీసి, మిగిలిన ఆల్కహాల్‌ను సిప్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఒక చెత్త కుండీపై కూర్చున్న రెండు కోతులు చేసిన ఈ పని అందర్నీ ఆకట్టుకుంటుంది. చెత్త బిన్‌పై కూర్చున్నా రెండు కోతులు బీరు తాగడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెటింట్లో చక్కర్లు కొడుతుంది. బ్రెజిల్‌లోని పరానాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వైరల్ వీడియోపై అధికారులు స్పందించారు. పర్యావరణ మునిసిపల్ డిపార్ట్‌మెంట్ అటువంటి ప్రవర్తన జంతువుల ఆరోగ్యానికి ఆందోళన కలిగిస్తుందని ప్రజలను అప్రమత్తం చేసింది. కోతులు మానవ ఉనికికి దగ్గరగా ఉండే జీవులు కావచ్చని, అయితే మానవ ఆహారం, పానీయాలు తీసుకోవడం వాటి ఆరోగ్యానికి హానికరం అని అధికారులు పేర్కొన్నారు. కోతులు మద్యం సేవిస్తున్నట్లు కనిపించిన దృశ్యాలు చాలు అరుదు. కోతులు మద్యం సేవించడం చాలా హానికరం. వ్యర్థ పదార్థాల నిర్వహణ, వాటిని పారవేయడం విషయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, హానికరమైన ఉత్పత్తులు పడేయొద్దని అధికారులు కోరారు.

ఇంతకుముందు భారత్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో కోతుల బెడద నమోదవుతున్న సందర్భంలో, ఒక కోతి మద్యం షాపులోకి ప్రవేశించి బీరు తాగుతూ కెమెరాకు చిక్కింది. కోతి దుకాణంలోకి చొరబడి మద్యం ఉత్పత్తులను దొంగిలించిందని ఆరోపించారు. 2022లో ఆన్‌లైన్‌లో విడుదలైన ఈ వీడియోలో, కోతి బీర్ క్యాన్ నుండి మద్యం తాగుతూ కనిపించింది. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా హైలైట్ అయింది.

వైరల్ అవుతున్న వీడియో:

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి