AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చిటారు కొమ్మన ఉన్న కోతిపై పులి అటాక్.. ఎండింగ్ మాత్రం అస్సలు ఊహించలేరు…

సింహాన్ని అడవికి 'రాజు' అని పిలుస్తారు. అలా అని పులి రేంజ్ ఏ మాత్రం తక్కువకాదు. పులి గర్జన విని అడవి మొత్తం వణికిపోతుంది. ఈ జంతువుకు ఒక ప్రత్యేకత ఉంది.

Viral Video: చిటారు కొమ్మన ఉన్న కోతిపై పులి అటాక్.. ఎండింగ్ మాత్రం అస్సలు ఊహించలేరు...
Monkey Tiger Fight
Ram Naramaneni
|

Updated on: Mar 23, 2021 | 7:27 PM

Share

సింహాన్ని అడవికి ‘రాజు’ అని పిలుస్తారు. అలా అని పులి రేంజ్ ఏ మాత్రం తక్కువకాదు. పులి గర్జన విని అడవి మొత్తం వణికిపోతుంది. ఈ జంతువుకు ఒక ప్రత్యేకత ఉంది. పులి వేట మొదలెడితే తప్పించుకోవడం ఏ జంతువు వల్ల కాదు. కానీ  అడవిలో అల్లరి చేస్తూ.. పెద్ద, పెద్ద జంతువులకు మస్కా కొట్టే కోతి కూడా ఉంటుందన్న విషయం మర్చిపోకూడదు. ఈ క్రమంలో మీ ముందుకు ఓ ఆసక్తికర వీడియోను తీసుకొచ్చాం. చెట్టు ఎక్కి చిటారుకొమ్మన కూర్చున్న కోతిని వేటాడేందుకు.. పులి కూడా చెట్టు ఎక్కింది. ఈ క్రమంలో కోతి తన చేష్టలతో పులి దూకుడు చెక్ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.

వీడియోలో, మొదటి పులి వేటాడే ఉద్దేశ్యంతో చెట్టుపైన ఉన్న కోతి వద్దకు వెళుతుంది.  కాని కోతి దగ్గరికి వచ్చేవరకు ఏమి ఎరగనట్టు నటించి.. దాన్ని కిందపడేలా చేసింది. వీడియోలో కోతి స్కిల్ చూసిన ప్రతి ఒక్కరూ.. వారెవ్వా అంటూ కామెంట్లు పెడుతున్నారు. వీడియోను నిశితంగా గమనిస్తే.., ఒక చెట్టు కొమ్మపై ఊగిసలాడుతున్న కోతిని ఆహారంగా మలుచుకునేందుకు పులి కూడా చెట్టు ఎక్కడం మీరు చూడవచ్చు. సమీపానికి వచ్చి.. మీదకు దూకబోతున్న సమయంలో కోతి  ఒక్కసారిగా పక్కకి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో పులి చెట్టు నుంచి నేరుగా కింద పడిపోతుంది. కోతికి వచ్చిన విద్య ఏంటంటే.. ఒక చెట్టుపై నుంచి మరో చెట్టుపైకి అలవోకగా దూకడం. తన ప్లేసుకు వచ్చి మరీ దాడి చేసేందుకు ప్రయత్నిస్తే.. వానరం ఎందుకు ఊరుకుంటుంది చెప్పండి..?. అందుకే తన మార్క్ కౌంటర్ ఇచ్చింది.

ఈ ఫన్నీ వీడియోను ఐఎఫ్ఎస్ ప్రవీణ్ అంగూసామి షేర్ చేశారు.’మీ బలహీనతలు పట్టుకుని వేలాడకండి, ఎల్లప్పుడూ మీ బలం ఏంటో తెలుసుకుని ఆట ఆడండి’ అనే శీర్షిక రాశారు. ఈ వీడియోను నెటిజన్లు చాలా ఇష్టపడుతున్నారు.

Also Read:  COVID Vaccine: కేంద్రం కీలక నిర్ణయం.. ఏప్రిల్‌ 1 నుంచి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్

Revanth Reddy Corona Positive: రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌.. స్వయంగా ట్వీట్ చేసిన కాంగ్రెస్ ఎంపీ