ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా, కేరళ ఎన్నికల్లో టికెట్ లభించని మహిళా కాంగ్రెస్ మాజీ చీఫ్ ప్రకటన

కేరళ ఎన్నికల్లో  టికెట్ లభించని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు లతికా సుభాష్ తాను ఇండిపెండెంటుగా పోటీ చేస్తానని ప్రకటించారు. పార్టీ తనకు టికెట్ ఇవ్వనందుకు నిరసనగా...

ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా, కేరళ ఎన్నికల్లో టికెట్ లభించని మహిళా కాంగ్రెస్ మాజీ చీఫ్ ప్రకటన
I Will Contest As Independent In Kerala Polls Says Ex Kerala Mahila Congress President
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 23, 2021 | 7:03 PM

కేరళ ఎన్నికల్లో  టికెట్ లభించని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు లతికా సుభాష్ తాను ఇండిపెండెంటుగా పోటీ చేస్తానని ప్రకటించారు. పార్టీ తనకు టికెట్ ఇవ్వనందుకు నిరసనగా ఆమె ఇటీవల తిరువనంతపురంలోని  పార్టీ కార్యాలయం ముందు శిరోముండనం చేయించుకున్నారు. పార్టీకి కూడా రాజీనామా చేశానని  ఆమె అన్నారు. ఎట్టుమన్నూర్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయగోరుతున్నారు. తను ఏ పార్టీలోనూ చేరడం లేదని చెప్పిన ఆమె..  కాంగ్రెస్ పార్టీ 86 మంది అభ్యర్థుల పేర్లతో జాబితా విడుదల చేసిందని, కానీ అందులో తొమ్మిది మంది మహిళలు మాత్రమే ఉన్నారని అన్నారు. కనీసం ఒక్కో నియోజకవర్గం నుంచి ఒక్కో మహిళకు టికెట్ ఇఛ్చినా సరిపోయేదని లతికా సుభాష్ వ్యాఖ్యానించారు. పార్టీ కోసం పని చేసి, శ్రమించిన మహిళలకు మొండి చెయ్యి చూపారని ఆమె ఆరోపించారు. పూర్తిగా వారిని నిర్లక్ష్యం చేశారని దుయ్యబట్టారు.

తనలాగే పలువురు మహిళా కార్యకర్తలకు అన్యాయం జరిగిందని లతికా సుభాష్ విచారం వ్యక్తం చేశారు. కేరళ ఎన్నికలు ఏప్రిల్ 6 న జరగనున్నాయి. మే 2 న ఫలితాలను ప్రకటిస్తారు.  ఇలా ఉండగా.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం కేరళ  ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. మంగళవారం కొట్టాయం లో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన అయన..తమ పార్టీ అధికారంలోకి వస్తే  న్యాయ్ పథకాన్ని అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. ఈ పథకం కింద ప్రతి వారికీ ఏడాదికి వారి బ్యాంకు ఖాతాల్లో 72 వేలు జమ అవుతాయని, ఇది వారి అభివృధ్దికి దోహద పడుతుందని ఆయన అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ప్రజలకు చేసిందేమీ లేదని, ఈ సర్కార్ రైతులు, కార్మికులు, ఇతర అన్ని వర్గాల విశ్వాసాన్ని కోల్పోయిందని ఆయన విమర్శించారు.

మరిన్ని చదవండి ఇక్కడ :సూపర్ మార్కెట్ లో చిలిపిదొంగ..పట్టపగలు అందరూ చూస్తుండగానే దొంగతనం..వైరల్ అవుతున్న వీడియో..:Bird thief video.

నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న సమంత‌ ఓల్డ్‌ వీడియో.. చూసి ఫ్యాన్స్‌ షాక్‌..!: Samantha old viral video.

నీకు కడుపు పండాలీ అంటే చిన్నారిని బలివ్వాలీ అని చెప్పగానే నమ్మింది..!చివరికి ఇలా..:Women believes a child is sacrified Video.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన