Viral Video: కుక్కపిల్లను సొంత బిడ్డలా చూసుకుంటోన్న కోతి.. వీడియో చూడండి
మనుషుల్లో మానవత్వం రోజురోజుకు కనుమరుగవుతూ.. కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే తమ పిల్లలను కడతేర్చుతున్న ఘటనలు మనం చూస్తున్నాం. ప్రస్తుత కాలంలో మనుషుల్లో కనుమరుగవుతున్న మానవత్వం జంతువుల్లో కనిపిస్తోందా అనిపిస్తోంది. ఇలాంటి సంఘటనలకు అద్దం పట్టే వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కుక్కపిల్లను ఎత్తుకెళ్లిన కోతిని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కోతి ఎక్కడినుంచి తెచ్చిందో కానీ ఓ కుక్కపిల్లను తెచ్చుకుంది. దానిని తన బిడ్డలాగే ఎంతో ప్రేమగా చూసుకుంటోంది. ఆ కుక్కపిల్లను పట్టుకొని చెట్ల కొమ్మలపైన అటూ ఇటూ గెంతుతూ ఉంది. నేలపైన నడిచే ఆ కుక్కపిల్లను చెట్లపైకి తీసుకెళ్లి లాలిస్తోంది. ఈ క్రమంలో ఆ కుక్కపిల్లకు కోతిని పట్టుకోవడం రావట్లేదు. అది ఎక్కడ జారి పడిపోతుందో అనిపిస్తుంది. కానీ కోతిమాత్రం దానిని ఎంతో జాగ్రత్తగా పట్టుకుని కాపాడుకుంటుంది. ఆ కుక్కపిల్లలో తన సొంత బిడ్డను చూసుకుని మురిసిపోయింది.
ఈ ఘటనను అక్కడే ఉన్న వారు తమ మొబైల్‌లో వీడియో తీసారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. స్వచ్ఛమైన తల్లి ప్రేమ అని కొందరు.. ఈ కోతికి అల్లరి చేయడమేకాదు.. ప్రేమించడమూ తెలుసు అంటూ మరికొందరుకామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికే 3 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. 4 లక్షలమందికి పైగా లైక్‌చేశారు.
వీడియో దిగువన చూడండి….
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..