Viral News: డుమ్మా కొట్టకుండా బడికి వస్తున్న కొండముచ్చు.. పిల్లలతో కలిసి శ్రద్ధగా పాఠాలు వింటుంటే..

|

Sep 15, 2022 | 11:28 AM

క్లాస్ రూమ్ నుంచి స్కూల్ ఆఫీస్ వరకు లంగూర్‌ ఉన్న వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అది ఎవరికీ ఎలాంటి హానీ, ఎటువంటి బెదిరింపులు గానీ చేయలేదు. ఒక వారం నుండి ఇతర విద్యార్థులతో కలిసి శాంతియుతంగా తరగతులకు హాజరవుతోంది.

Viral News: డుమ్మా కొట్టకుండా బడికి వస్తున్న కొండముచ్చు.. పిల్లలతో కలిసి శ్రద్ధగా పాఠాలు వింటుంటే..
Langur
Follow us on

Viral News: జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లా దనువా గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో కోతి రూపంలో కొత్త విద్యార్థి వచ్చింది. అవును, మేము తమాషా చేయడం లేదు! పాఠశాలలో గత వారం రోజులుగా విద్యార్థులతో కలిసి తరగతులకు హాజరవుతున్న కొండముచ్చు కనిపించడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆశ్చర్యపోతున్నారు. క్లాస్ రూమ్ నుంచి స్కూల్ ఆఫీస్ వరకు లంగూర్‌ ఉన్న వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అది ఎవరికీ ఎలాంటి హానీ, ఎటువంటి బెదిరింపులు గానీ చేయలేదు. ఒక వారం నుండి ఇతర విద్యార్థులతో కలిసి శాంతియుతంగా తరగతులకు హాజరవుతోంది.

ఉదయం 9 గంటలకు పాఠశాల తెరిచిన వెంటనే కోతి పాఠశాల ప్రాంగణానికి చేరుకుంటుందని, సాధారణంగా తరగతులు ముగిసిన తర్వాత సాయంత్రం బయలుదేరుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రతన్ వర్మ తెలిపారు. వారం రోజుల క్రితం అకస్మాత్తుగా పాఠశాలలో 9వ తరగతిలోకి ప్రవేశించడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. అయినా ఎవరికీ హాని తలపెట్టకుండా విద్యార్థులతో పాటుగా క్లాసులోని బెంచీపై కూర్చుందని చెప్పారు. అప్పటి నుంచి ఏదో క్లాస్‌ రూమ్‌లో చేరడం, విద్యార్థులతో కలిసి ముందు వరుసలో కూర్చోవడం పరిపాటిగా మారింది. పైగా టీచర్లు చెప్పే పాఠాలు, మాటలు కూడా శ్రద్ధగా వింటుందని చెప్పారు.

బుధవారం అది ప్రధానోపాధ్యాయుడి గదికి చేరుకుని టేబుల్‌పై కూర్చుంది. క్లాసులు మొదలయ్యాక మళ్ళీ క్లాసుకి వెళ్లింది. ప్రిన్సిపాల్ లంగూర్‌ని తరిమికొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ, అతను తరగతి గదిలోనే ఉన్నాడు.దీనిపై అటవీశాఖకు సమాచారం అందించామని స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ సకల్‌దేవ్ యాదవ్ తెలిపారు. కానీ, వారు దానిని పట్టుకోలేకపోయారు.

ఈ మేరకు హజారీబాగ్‌లోని సీనియర్ అటవీ శాఖ అధికారి అయూబ్ అన్సారీ మాట్లాడుతూ, సమాచారం అందుకున్న మా బృందం లంగూర్‌ను పట్టుకోవడానికి పాఠశాలకు చేరుకుంది. జంతువును అడవి వైపు మళ్లించడానికి మేము పండ్లు ఇతర తినుబండారాలను ఉపయోగించాము. లంగూర్‌ను పట్టుకోవడంలో అధికారులు విఫలమైనప్పటికీ, వారు జంతువును పాఠశాల ఆవరణ నుండి తరిమికొట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి