AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: జైలు బయట నుంచి లోపలికి పార్శిల్ విసిరిన వ్యక్తి.. అందులో ఏముందా అని ఓపెన్ చేయగా..

గంజాయి సేవించినా, సాగు చేసినా, స్మగ్లింగ్ చేసినా క్రైమ్ అని అందరికీ తెలుసు. అదే పని జైల్లో చేస్తే ఇంకేమనాలి చెప్పండి. నాగ్‌పూర్ సెంట్రల్ జైలు గంజాయి వినియోగానికి కేంద్రంగా మారినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే తాజాగా అక్కడ ఓ ఘటన వెలుగుచూసింది.

Viral: జైలు బయట నుంచి లోపలికి పార్శిల్ విసిరిన వ్యక్తి.. అందులో ఏముందా అని ఓపెన్ చేయగా..
Jail Wall (Representative image)
Ram Naramaneni
|

Updated on: May 27, 2023 | 4:34 PM

Share

అది నాగ్‌పూర్ సెంట్రల్ జైలు. భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. కాగా శుక్రవారం అక్కడ ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి.. జైలు గోడ బయటి నుంచి లోపలికి ఓ పార్శిల్ విసిరేశాడు. దీంతో జైలు సిబ్బంది ఒక్కసారిగా అలెర్టయ్యారు. ఆ పార్శిల్‌ను ఎక్స్‌పర్ట్స్‌తో ఓపెన్ చేయించగా.. లోపల సెల్‌ఫోన్‌తో పాటు గంజాయి ఉండటం చూసి అవాక్కయ్యారు. జైలు పరిసరాల్లో భద్రతా ఉల్లంఘనలు ఏ లెవల్‌లో జరుగుతున్నాయో ఈ ఘటన తెలియజేస్తుంది. శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటలకు జైలులోని వాచ్‌మెన్,  పెట్రోలింగ్ సిబ్బంది కాంపౌండ్ వాల్ దగ్గర ఈ అనుమానాస్పద ప్యాకేజీని స్వాధీనం చేసుకున్నారు. ఫోన్‌ను పగిలిపోకుండా జాగ్రత్తగా ప్లాస్టిక్ కవర్‌లో చుట్టారని అధికారులు తెలిపారు.

జైలులో  వెనుక భాగంలో ఉన్న నీటిపారుదల శాఖ ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తులు అక్రమంగా ఈ ప్యాకెట్ విసిరినట్లు విచారణలో తేలింది. దీంతో తనిఖీలు చేయగా..  జైలు ఆసుపత్రి సమీపంలో మరో రెండు ప్యాకేజీలు దొరికాయి. దీంతో జైలు అధికారులు ధంతోలి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు  ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా నాగ్‌పూర్ జైలు ఆవరణలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ.. అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు జైలు సిబ్బంది కూడా ఈ తరహా పనులకు సహకరిస్తున్నట్లు చెబుతున్నారు. తప్పు చేసి జైళ్లకు వెళ్లినవారు.. లోపల ఇలా గంజాయి వంటివి తాగితే ఇంకేం బాగుపడతారు చెప్పండి.

మరిన్ని జాతీయ వార్తల కోసం..