పార్క్ చేసిన కార్లు, బైకులకు నిప్పు అంటుకున్న ఘటనలు ఈ మధ్య కాలంలో అనేకం వెలుగులోకి వస్తున్నాయి. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా నమోదవుతున్నాయి. ఫలితంగా కార్లు, ఇతర పార్క్ చేసిన వాహనాలకు మంటలు అంటుకుని పేలిపోతున్న సంఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక వ్యాన్‌కు మంటలు వ్యాపించాయి. అయితే ఉన్నట్టుండి వాహనం పేలడంతో వ్యాన్ గాల్లోకి ఎగిరింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియా వినియోగదారులను షాక్‌కు గురిచేస్తుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌కు చెందినదిగా తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే…
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఒక కారు మంటల్లో చిక్కుకున్న ఘటన చోటు చేసుకుంది. బులంద్‌షహర్‌లోని ఖాన్‌పూర్ మార్కెట్ మధ్యలో ఉంచిన మారుతీ వ్యాన్‌లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. కారు నుండి భారీ మంటలు వ్యాపించాయి. కారులో మంటలు చెలరేగడంతో పాటు ఒక్కసారిగా కారు పేలిపోయింది. సుమారు 20 నిమిషాలపాటు ఆ వాహనం కాలిపోయింది. అనంతరం పెట్రోల్ ట్యాంకు పెద్ద శబ్దంతో పేలడంతో ఆ వ్యాన్ గాల్లోకి ఎగిరి పడింది. ఈ భయానక ఘటన కెమెరాలో రికార్డైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
देखिए बुलंदशहर मारुति वैन में आग लगने के बाद हुआ ज़ोरदार धमका,धमाके से वैन के परखच्चे उड़े pic.twitter.com/xx8vf1IIgs
— Lavely Bakshi (@lavelybakshi) May 9, 2024
కారులో మంటలు చెలరేగడంతో జరిగిన భారీ పేలుడును చూసిన ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. అదృష్టవశాత్తూ ప్రమాదం జరిగినప్పుడు కారులో, సమీపంలో ఎవరూ లేరు. మారుతీ వ్యాన్ సిఎన్‌జితో నడిచే కారు అని, కారులో అమర్చిన గ్యాస్ సిలిండర్ కారణంగా పేలుడు సంభవించిందని వార్తలు వచ్చాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..