తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి.. స్కానింగ్ రిపోర్ట్‌తో షాకిచ్చిన డాక్టర్స్..!
పురుషుల్లో కూడా గర్భసంచి ఉంటుందా..? మగవారు పిల్లల్ని కనగలరా..? అదెలా సాధ్యం.? తరచూ సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఇలాంటిదే షాకింగ్ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. తీవ్రమైన కడుపు నొప్పితో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తిని పరీక్షించిన వైద్యులు కళ్లు బైర్లు కమ్మేసే నిజాన్ని బయటపెట్టారు. అతడి స్కానింగ్ రిపోర్ట్ బయటపడగానే.. రోగి మాత్రమే కాదు.. మొత్తం నగరాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో దాని వెనుక ఉన్న నిజం ఏంటో తెలుసుకుందాం.

ఒక డాక్టర్.. పురుషుడి కడుపులో గర్భాశయం ఉందని చెప్పినపుడు అతని కాళ్ళ కింద భూమి కంపించటం సహజం. అలాంటి ఒక షాకింగ్, అంతే వింతైన కేసు ఇటీవల వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడి ఉచెహ్రా నగర్ పంచాయతీ అధ్యక్షుడు నిరంజన్ ప్రజాపతి గత కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపు సమస్యలతో బాధపడుతున్నారు. నిరంతర నొప్పి కారణంగా జనవరి 14న ఒక ప్రసిద్ధ డయాగ్నస్టిక్ సెంటర్‌కు వెళ్లి సోనోగ్రఫీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ, సోనోగ్రఫీ రిపోర్ట్ చేతికి వచ్చినప్పుడు, వారు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. ఈ 47 ఏళ్ల వ్యక్తికి గర్భాశయం ఉందని, ఇంకా చెప్పాలంటే అది తలక్రిందులుగా ఉందని నివేదిక పేర్కొంది. ఒక వ్యక్తి శరీరంలో ఉమ్మనీటి సంచి ఉందని ఈ నివేదిక చూసి షాక్ అయ్యారు.
ఈ పరీక్ష సత్నా డయాగ్నస్టిక్ సెంటర్‌లో జరిగింది. నిరంజన్ ప్రజాపతి స్వయంగా ప్రజా ప్రతినిధి. కాబట్టి, ఈ సంఘటన గురించిన చర్చ జిల్లా అంతటా దావానలంలా వ్యాపించింది. రిపోర్ట్ నివేదిక బయటపడగానే అందరూ షాక్ అయ్యారు. అలా ఎలా జరుగుతుందని సర్వత్రా చర్చ మొదలైంది. ఈ వింత విషయం గురించి సంబంధిత డయాగ్నస్టిక్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ అరవింద్ సరాఫ్‌ను నిరంజన్ ప్రజాపతి అడిగినప్పుడు, ఆయన ఈ విషయంపై స్పందించడానికి నిరాకరించాడు. దీంతో వైద్యుడి వైఖరిపై అనుమానాలను రేకెత్తించింది. ఇది తీవ్రమైన వైద్య నిర్లక్ష్యం వల్ల జరిగిన కేసు అని స్పష్టమైంది.
ప్రజాపతిగా ఉన్న తన పేరు ప్రతిష్టలను, తప్పుడు నివేదిక వల్ల కలిగిన మానసిక వేదనతో అతడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయంలో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన సత్నా జిల్లా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (CMHO) డాక్టర్ మనోజ్ శుక్లా విచారణకు హామీ ఇచ్చారు. తప్పుడు సోనోగ్రఫీ నివేదికకు సంబంధించి ఫిర్యాదు అందిందని, ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు తర్వాత సంబంధిత కేంద్రంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
ఒక ప్రజా ప్రతినిధి విషయంలో ఇలాంటి పొరపాటు జరిగితే, సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని స్థానిక పౌరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి తప్పుడు నివేదిక రోగికి తప్పుడు చికిత్స అందడానికి, అతని ప్రాణాలను కోల్పోవడానికి దారితీస్తుందనే భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




