AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఓరీ దేవుడో చేపల ఫ్రై కోసం ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు..! ఊపిరి బిగపట్టి వీడియో చూడండి..

వైరల్‌ వీడియోలో ఒక వ్యక్తి, తన స్నేహితుల బృందంతో కలిసి నదిలో చేపల వేటకు వెళ్లాడని తెలుస్తుంది. అలాగే, వారు పట్టుకున్న చేపల్ని అక్కడే నీటి ఒడ్డునే ఫ్రై చేసుకుని తినేందుకు రెడీ చేసుకుంటున్నారు. ఆ ఒడ్డునే కట్టెలతో పొయ్యి ఏర్పాటు చేసుకున్నారు. నిప్పు వెలిగించి పాన్‌లో నూనె పోసి మరిగించారు. ఇంకా ఫ్రేమ్‌లో ఒక వ్యక్తి చేతిలో వేయించాల్సిన చేపను పట్టుకుని ఆ పొయ్యి వద్దకు వచ్చాడు.

Watch: ఓరీ దేవుడో చేపల ఫ్రై కోసం ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు..! ఊపిరి బిగపట్టి వీడియో చూడండి..
Fry Fish
Jyothi Gadda
|

Updated on: Jun 24, 2025 | 11:51 AM

Share

సోషల్ మీడియా ప్రపంచం వేల,మిలియన్ల వీడియోలతో నిండి ఉంది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో వీడియోలు షేర్ చేయబడే వేదిక ఇది. వాటిలో కొన్ని మిమ్మల్ని నవ్విస్తాయి. మరిన్ని ఒళ్లు గగ్గుర్పాటుకు గురిచేస్తాయి. ప్రజల జీవితాలు ప్రమాదంలో ఉన్నప్పుడు అజాగ్రత్తకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో అనేకం కనిపిస్తున్నాయి. మీరు నమ్మరు కానీ అలాంటి ఒక షాకింగ్ వీడియో ఇప్పుడు బయటపడింది. అజాగ్రత్త కారణంగా ఒక వ్యక్తి మరుగుతున్న నూనెలో పడకుండా తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డాడు. వీడియో మాత్రం నెట్టింట వేగంగా వైరల్‌ అవుతోంది.

వైరల్‌ వీడియోలో ఒక వ్యక్తి, తన స్నేహితుల బృందంతో కలిసి నదిలో చేపల వేటకు వెళ్లాడని తెలుస్తుంది. అలాగే, వారు పట్టుకున్న చేపల్ని అక్కడే నీటి ఒడ్డునే ఫ్రై చేసుకుని తినేందుకు రెడీ చేసుకుంటున్నారు. ఆ ఒడ్డునే కట్టెలతో పొయ్యి ఏర్పాటు చేసుకున్నారు. నిప్పు వెలిగించి పాన్‌లో నూనె పోసి మరిగించారు. ఇంకా ఫ్రేమ్‌లో ఒక వ్యక్తి చేతిలో వేయించాల్సిన చేపను పట్టుకుని ఆ పొయ్యి వద్దకు వచ్చాడు. పాన్ దగ్గరికి చేరుకున్న అతడు.. ఆ నూనె ఎంత వేడిగా ఉందో ఊహించలేదు. ఎదురుగా వీడియో తీస్తున్న కెమెరాకు ఫోజులిస్తూ.. అతడు చేపను పొయ్యిపై ఉన్న నూనెలో వేస్తాడు. దాంతో ఒక్కసారిగా ఆ కాడాయ్‌లోంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. చేపతో పాటుగా ఆ యువకుడి ముఖానికి మంటలంటుకున్నాయి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి…

కానీ, అదృష్టవశాత్తు తృటిలో అతడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అతడు చేపను మరిగే నూనెలో వేయగానే, పాన్‌లోని నూనె అగ్నిపర్వతంలా ఉప్పొంగింది. దాని నుండి ప్రమాదకరంగా మంటలు వ్యాపించాయి. ఆ మంట అతడి ముఖానికి కూడా అంటుకోవడంతో అతడు వెంటనే నదిలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. లేదంటే, చేపలను వేయించడానికి బదులుగా ఆ వ్యక్తి తానే స్వయంగా మంటల్లో కాలిపోయేవాడు. వైరల్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ronielsouza21 అనే హ్యాండిల్ నుండి షేర్ చేయగా, మిలియన్ల కొద్దీ వీడియోలు, లైక్‌లను సేకరించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే