Viral Video: పాముకు చిర్రెతించాడు.. చివరకు అది చేసిన పనికి షాక్ తిన్నాడు
పామును చూస్తేనే మనం భయంతో పరుగులు పెడతాం.. అదే పాము మనకు ఎదురు పడితే ఇంకేమైనా ఉందా పై ప్రాణాలు పైనే పోతాయి. కొంతమంది మాత్రం ఏమాత్రం భయం లేకుండా పాములను పట్టుకోవడం..

Viral Video: పామును చూస్తేనే మనం భయంతో పరుగులు పెడతాం.. అదే పాము మనకు ఎదురు పడితే ఇంకేమైనా ఉందా పై ప్రాణాలు పైనే పోతాయి. కొంతమంది మాత్రం ఏమాత్రం భయం లేకుండా పాములను పట్టుకోవడం.. వాటితో ఆటలాడటం లాంటివి చేస్తుంటారు. పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. వీటిలో కొన్ని భయాన్ని కలిగిస్తే మరికొన్ని మాత్రం వణుకు పుట్టిస్తాయి. తాజాగా ఇలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూస్తే భయపడాలో లేక నవ్వుకోవాలో అర్ధం కాదు. సోషల్ మీడియాలో ఒక ప్రమాదకరమైన పాము వీడియో వైరల్ అవుతోంది. కోబ్రాతో ఆడుకోవడానికి వెళ్లిన వ్యక్తి చేసిన పనిని వైరల్ అవుతోంది.
అతను పామును చిరాకు పెట్టాడు . చివరకు పాము అతనికి ఊహించని షాక్ ఇచ్చింది. ఈ వీడియోను ఇప్పటివరకు వేలాది మంది వీక్షించారు. ఈ వైరల్ వీడియోలో ఆ వ్యక్తి పామును వేధిస్తున్నట్లు మీరు చూడవచ్చు. పాము తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా, నీలిరంగు చొక్కా ధరించిన వ్యక్తి దాని తోకను పట్టుకుని ముందుకు వెనుకకు విసిరాడు. చివరగా నాగుపాము వేధింపులు తట్టుకోలేక తన ప్రైవేట్ పార్ట్‌పై ఒక్కసారిగా కొరికింది. దాంతో అతడు లబోదిబోమన్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
View this post on Instagram
మరిన్ని వైరల్ వార్తల కోసంhttps://tv9telugu.com/trending క్లిక్ చేయండి