Watch: బయట భోజనం చేసేవారికి మరోక అలర్ట్.. ఫ్లోర్ ఊడ్చిన చెత్త కూడా..! వాక్ తూ..
నేడు చాలా మందికి బయట తినడం ఒక అలవాటు. బయట తినడం మన ఆరోగ్యానికి హానికరమని మనకు తెలిసినప్పటికీ, ఇప్పటికీ రుచి కోసం తమ ఆరోగ్యంతో జూదం ఆడతున్నారు చాలా మంది. అలాంటి వారు ఈ వీడియో చూడాలి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చాలా మందిని షాక్‌కు గురిచేసింది. ఈ వీడియోను థ్రెడ్స్ ఖాతాలో షేర్ చేశారు. మీరు ఈ వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు...

కొంతమందికి ఇంట్లో భోజనం రుచించదు. ఇంకొంతమందికి వండడానికి బోరింగ్‌గా ఉంటుంది.. మరికొంతమందికి పని మధ్యలో వంట చేయడానికి సమయం ఉండదు…ఈ సాకుతో చాలా మంది హోటళ్ళు, రెస్టారెంట్లలో భోజనం చేయడం అలవాటు చేసుకున్నారు. తరచుగా బయట భోజనం చేసేవారికి చాలా వ్యాధులు స్థిరపడతాయి. ఎందుకంటే బయట ఆహారం తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ విషయం తెలిసి కూడా ఎవరూ బయట తినడం మానుకోరు.. చాలా మందికి ప్రతిరోజూ బయట ఆహారం తినే అలవాటు ఉంటుంది. అలాంటి వారు ఈ వీడియో చూస్తే, ఈ జన్మలో మళ్ళీ బయట ఆహారం తినరు.
ఈ వీడియోకు ఇంట్లోనే తినండి. ఈ రెస్టారెంట్లను మీరు నమ్మలేరు అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ వైరల్ వీడియోలో ఒక రెస్టారెంట్‌లోని ఒక వ్యక్తి అక్కడ ఫ్లోర్ ఊడ్చిన చెత్తను స్టౌవ్ మీద వండుతన్న ఆహారంలోనే పోసేశాడు. ఇంత ఘోరమైన వీడియో ఇప్పుడు ఇంటర్ నెట్ లో వైరల్ అవుతోంది. చూసిన ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురిచేసింది. అందుకే మీరు ఇంట్లోనే తినాలి అనేది ఈ వీడియోకు ఇచ్చిన క్యాప్షన్.
వీడియో ఇక్కడ చూడండి…
View this post on Instagram
ఈ వీడియోను వేలాది మంది చూశారు. వారిలో ఎక్కువ మంది వివిధ రకాలుగా వ్యాఖ్యానించారు. అవును, ప్రతి ఒక్కరూ బయట తినడం మానేయాలి. ఇంట్లోనే తినండి, ఆరోగ్యంగా ఉండండి అంటూ ఎక్కువ మంది కామెంట్లు పెడుతున్నారు. ఇది నిజమైన వీడియో కాదని, ఇది AI వీడియో అని ఇంకొందరు వ్యాఖ్యానించారు. ఈ వీడియో చూసిన తర్వాత, మీరు ఇంట్లో తినాలా లేదా బయట తినాలా అని నిర్ణయించుకోవాలి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




