Viral Video: కుక్కకి బయపడి ట్రక్‌ని ఢీకొట్టిన వ్యక్తి.. హృదయ విదారక వీడియో వైరల్
దేశ వ్యాపంగా కుక్కలకు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూనే ఉంటాయి. అయితే ప్రస్తుతం ఒకవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో కుక్కల కారణంగా ప్రజలు ఎప్పటి వరకు మరణిస్తూ ఉంటారనే పెద్ద ప్రశ్నను లేవనెత్తింది. ఈ వీడియోలో కుక్క మొరిగడం వల్లే ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని తెలుస్తుంది. ఈ ప్రమాదం హృదయ విదారకంగా ఉంది.

ఇటీవల సుప్రీంకోర్టు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని అన్ని వీధి కుక్కలను షెల్టర్ హోమ్‌లలో ఉంచాలని ఆదేశించినప్పుడు కుక్కల గురించి చాలా గొడవ జరిగింది. వాస్తవానికి కుక్క కాటు సంఘటనలు పెరుగుతున్నందున ఈ ఉత్తర్వు ఇవ్వబడింది. కుక్క కాటు సంఘటనలు తరచుగా జరుగుతాయని.. కుక్క కరవడం వలన చాలాసార్లు ప్రజలు చనిపోతున్నారనే వార్తలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఒక కుక్కకి సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసి ప్రజలు షాక్ అవుతున్నారు. కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియోలో రోడ్డుపై వెళ్తున్న ఒక వ్యక్తి అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదానికి గురయినట్లు చూడవచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సంఘటన కుక్క మొరుగుటతో ప్రారంభమవుతుంది. వాస్తవానికి ఆ వ్యక్తి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతుండగా.. అకస్మాత్తుగా అక్కడ ఉన్న ఒక కుక్క బిగ్గరగా మొరగడం ప్రారంభించింది. అప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ తనని కుక్క కరుస్తుందో అని భయపడినట్లు ఉన్నాడు.. దీత్నో కుక్క నుంచి తనని తాను రక్షించుకోవడానికి రోడ్డు వైపు పరిగెత్తడానికి ప్రయత్నించాడు. అయితే అప్పుడే వేగంగా ట్రక్కు అక్కడికి వచ్చింది.. ఆ వ్యక్తి ఆ ట్రక్ ని ఢీకొట్టి అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు.
ఈ హృదయ విదారక సంఘటన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @itz__daniyal80 అనే ఐడిలో షేర్ చేశారు. ఇక్కడ ఎవరి తప్పు ఉంది? కుక్క ప్రేమికులు ఏదైనా అనవచ్చు కానీ ఒక సమస్య ఉంది. మంచి విషయం ఏమిటంటే ట్రక్ డ్రైవర్ జాగ్రత్త తీసుకున్నాడు.. అనే క్యాప్షన్ ఉంది.
వైరల్ వీడియోను ఇక్కడ చూడండి
यहां किस की गलती है – डॉग लवर चाहे कुछ भी कहें लेकिन समस्या तो है !!🤐
अच्छी बात ये लगी कि ट्रक वाला आगे रुका!🤍 pic.twitter.com/JIlcUEfTr5
— itz__daniyal80 (@itz__daniyal80) September 7, 2025
కేవలం 11 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 4 లక్షలకు పైగా వీక్షించారు. వేలాది మంది దీనిని లైక్ చేసి వివిధ రకాల కామెంట్స్ చేశారు. వీధుల్లో ప్రమాదకరంగా మారుతున్న కుక్కల సంఖ్యను ఎందుకు నియంత్రించడం లేదని కొంతమంది నెటిజన్లు పరిపాలన అధికారుల నిర్లక్షాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ సంఘటనపై చాలా మంది తీవ్ర సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఒకరు ‘ఈ వీధి కుక్కలు చాలా ప్రమాదకరమైనవి’ అని, మరొకరు కుక్కల నుంచి రేబిస్ వ్యాధి వస్తుంది.. వాటికి దూరంగా ఉండటం మంచిది’ అని కామెంట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




