AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీకు దండంరా సామి.. కోళ్లు, కుక్కలతో సహా ఒకే బండి మీద ఇంతమంది ఏంటి గురూ..? పిల్ల‌ల ప్రాణాల‌తో చెల‌గాట‌మా..

ఈ వీడియోను జిందగీ గుల్జార్ హే అనే పేజీ ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ వైర‌ల్ వీడియోపై నెటిజ‌న్లు త‌లో ర‌కంగా కామెంట్ చేశారు. బైక్‌పై ఇంత‌మంది ప్ర‌యాణించ‌డం చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని కొంద‌రు నెటిజ‌న్లు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

నీకు దండంరా సామి.. కోళ్లు, కుక్కలతో సహా ఒకే బండి మీద ఇంతమంది ఏంటి గురూ..? పిల్ల‌ల ప్రాణాల‌తో చెల‌గాట‌మా..
Man Riding Bike
Jyothi Gadda
|

Updated on: Nov 23, 2022 | 9:27 PM

Share

సోషల్‌ మీడియాలో ప్రతినిత్యం చిత్ర విచిత్రమైన వీడియోలు, ఫోటోలు వైరల్‌ అవుతుంటాయి. మన ఇంటర్నెట్ వింత సంఘటనలు, విచిత్ర వీడియోలకు లైబ్రరీగా మారింది. అది వీధి వీడియో అయినా లేదా పొరుగు ప్రాంతం అయినా లేదంటే ఓ మారుమూల ప్రాంతమైన సరే.. మీరు సోషల్ మీడియాలో రకరకాల ఫన్నీ వీడియోలను చూస్తుంటారు. అలాంటి స్ట్రీట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, వీడియోలు వైరల్ కావడానికి మాత్రమే మార్గం కాదు. ఆ రోడ్డుపై ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తున్న ఘటన వైరల్‌గా మారింది. అయితే, ఇక్కడ మరో విషయం ఏంటంటే.. చాలా మంది బైక్‌లు నడుపుతారు. ఇంతకీ ఈ వీడియో వైరల్ కావడానికి కారణం ఏంటంటే.. బైక్‌పై ఓ వ్య‌క్తి ఏకంగా ఆరుగురిని ఎక్కించుకుని ఆపై రెండు కుక్క‌లు, రెండు కోళ్ల‌ను కూడా తీసుకువెళ్లిన వీడియో సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. ట్విట్ట‌ర్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో ఓ వ్య‌క్తి బైక్ న‌డుపుతుండ‌గా పిల్ల‌లు స‌హా ఆరుగురు వ్య‌క్తులు బైక్‌పై ప్ర‌యాణిస్తూ క‌నిపించారు. వీరితో పాటు రెండు కుక్క‌లు, కోళ్లు కూడా బైక్‌పై జ‌ర్నీ చేస్తున్నాయి.

తాజాగా ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను జిందగీ గుల్జార్ హే అనే పేజీ ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ వైర‌ల్ వీడియోపై నెటిజ‌న్లు త‌లో ర‌కంగా కామెంట్ చేశారు. బైక్‌పై ఇంత‌మంది ప్ర‌యాణించ‌డం చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని కొంద‌రు నెటిజ‌న్లు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పిల్ల‌ల భ‌ద్ర‌త ప‌ట్ల ఆ వ్య‌క్తికి అస‌లు ఏమాత్రం బాధ్య‌త లేదని కొంద‌రు యూజ‌ర్లు మండిప‌డ్డారు.

ఈ షార్ట్ క్లిప్‌ను ఆన్‌లైన్‌లో షేర్ చేసిన త‌ర్వాత ఇప్పటివ‌ర‌కూ 2.58 ల‌క్ష‌ల వ్యూస్ వ‌చ్చాయి. ఇలాంటి ఉల్లంఘ‌నుల‌కు భారీగా జ‌రిమానా వ‌డ్డించాల‌ని మ‌రికొంద‌రు పేర్కొన్నారు. ఇంత‌మంది ప్రాణాల‌తో ఎందుకు చెల‌గాట‌మాడుతున్నావ‌ని ఆ వ్య‌క్తిని కొంద‌రు ప్ర‌శ్నించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!