Viral Video: ఇంటర్నెట్( Internet) లో వింతగా ఉండే లేదా మనసుని ఆకట్టుకునే కంటెంట్‌కు స్వర్గధామం. ఇది నిజమని నిరూపించడానికి ఇప్పుడు మీకు ఒక వీడియో గురించి తెలియజేస్తాం. ఆన్‌లైన్(Online)లో చాలా వైరల్(viral)గా మారిన ఒక క్లిప్‌లో.. ఒక వ్యక్తి చక్కెర పొట్లంతో మ్యాజిక్ ట్రిక్ చేయడం చూడవచ్చు. ట్విట్టర్‌లో ఓవర్‌టైమ్ అనే పేజీలో పోస్ట్ చేయబడింది. 5 మిలియన్లకు పైగావ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ మ్యాజిక్ ట్రిక్ కు నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఈ మ్యాజిక్ ను ఖచ్చితంగా తనిఖీ చేయాలని అంటున్నారు.
I’ve watched this 57 times and still can’t figure it out ?? (via jadon.ray/TT) pic.twitter.com/TjsFrm7Udg
— Overtime (@overtime) February 25, 2022
ఈ వీడియో మొదట టిక్‌టాక్‌లో జాడోన్ రే పోస్ట్ చేశారు. 16-సెకన్ల క్లిప్‌లో.. ఒక వ్యక్తి తన నోటిలో సాచెట్‌ను పట్టుకుని చక్కెర పొట్లాన్ని చింపి ఎడమ చేతిలో పోసుకోవడం చూడవచ్చు. ఆ తర్వాత పంచదారను గాలిలోకి విసిరి నోటిలోంచి పొట్లం కవర్ ను నోటి నుంచి బయటకు తీశాడు. అనంతరం ఆ వ్యక్తి చక్కెరను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా తన కుడి చేతిని ఆకాశం వైపు చూపించాడు.. చేతిలోని పంచదారను అద్భుతంగా క్యాచ్ చేసినట్లు.. చేసి తిరిగి పంచదారను ప్యాకెట్‌లో పోశాడు.
Nah, Unk the Real Deal,
he been keeping people Stunned for Awhile! pic.twitter.com/HJzJVICKDC— 1up (@21_GunSalute) February 26, 2022
ఈ వీడియో చూసి ఓ నెటిజన్ స్పందిస్తూ.. “నేను దీన్ని 57 సార్లు చూశాను, ఇప్పటికీ మ్యాజిక్ ఎలా చేశాడు నేను గుర్తించలేకపోయాను” అని కామెంట్ చేశాడు. ఈ క్లిప్‌కు నెటిజన్ల నుంచి భారీగా స్పందన వచ్చింది. కొందరు దిగ్భ్రాంతి చెందగా, మరికొందరు ఆ వ్యక్తి నకిలీ బొటనవేలును ఉపయోగించి ట్రిక్ చేశాడంటూ కామెంట్ చేశారు.
Only thing I can think of is someone off camera handing him something ?, you should never assume someone isn’t helping during slight of hand. Dude’s good, watched many times following each hand, this is the only time it appears out of site. pic.twitter.com/5juRfzkTS3
— Orange and White (@MJediStarkiller) February 25, 2022
అతను నకిలీ బొటనవేలు ధరించాడు. అతను తన ఎడమ చేతిలో బొటనవేలుని టోపీతో కప్పాడు. అనంతరం పంచదార లోపల పోస్తాడు.. అతని బొటనవేలు నకిలీ బొటనవేలులో ఉంచాడు.. అప్పుడు నకిలీ బొటనవేలును తీసివేసి.. చక్కెరను పోస్తాడు అంటూ ఒక నెటిజన్ ఈ ట్రిక్ ను వివరించడానికి ప్రయత్నించాడు. మరొకతను “అవును నేను కొన్ని సార్లు చూశాను, పాజ్ చేసాను, ఎన్ని సార్లు చూసినా ఈ ట్రిక్ ను ఎలా చేసాడో నాకు అర్ధం కాలేదు.. అని కామెంట్ చేశాడు.
Yeah I watched it a few times, even paused it, I have no idea how he did this
— ArkatechBeatz.eth (@ARKATECHBEATZ) February 25, 2022
Also Read: