ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్.. నడి రోడ్డుపై కూర్చీ వేసుకొని రీల్ చేశాడు.. కట్ చేస్తే..

|

Apr 27, 2024 | 10:12 PM

సోషల్ మీడియాలో వైరల్ కావడానికి, ప్రజలు బహిరంగంగా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. అలాంటి సంఘటనకు సంబంధించిన వీడియోపై ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకున్నారు. వైరల్ వీడియోలో ఒక యువకుడు తన బైక్‌ను రోడ్డు మధ్యలో పార్క్ చేసి, ఆ పక్కనే కుర్చీ వేసుకుని దర్జాగా కూర్చుని రీల్‌ చేస్తున్నాడు. దీంతో పోలీసులు అతనికి తగిన గుణపాఠం చెప్పారు.

ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్.. నడి రోడ్డుపై కూర్చీ వేసుకొని రీల్ చేశాడు.. కట్ చేస్తే..
Man Makes Reel In Middle Of Road
Follow us on

ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ కావడానికి కొందరు రోజుకో కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు. వైరల్ రీల్‌ను రూపొందించే పిచ్చితో ప్రజలు విపరీత చెష్టలకు పాల్పడుతున్నారు. కొందరు తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి కూడా వెనుకాడరు. వైరల్ కావడానికి, ప్రజలు బహిరంగంగా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. అలాంటి సంఘటనకు సంబంధించిన వీడియోపై ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకున్నారు. వైరల్ వీడియోలో ఒక యువకుడు తన బైక్‌ను రోడ్డు మధ్యలో పార్క్ చేసి, ఆ పక్కనే కుర్చీ వేసుకుని దర్జాగా కూర్చుని రీల్‌ చేస్తున్నాడు. దీంతో పోలీసులు అతనికి తగిన గుణపాఠం చెప్పారు.

వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకున్నారు. అతన్ని అరెస్టు చేయడమే కాకుండా అతని బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అతనిపై శాస్త్రి పార్క్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మనిషికి చట్టం అంటే భయం లేదని, అందుకే మార్గమధ్యంలో ట్రాఫిక్ రూల్స్ తుంగలో తొక్కుతూ రీలు తీస్తున్నాడని వీడియో చూస్తే అర్థమవుతోంది.

ఇవి కూడా చదవండి

రీల్స్ పిచ్చితో సోషల్ మీడియా వ్యూస్‌ కోసం అతడు..బహిరంగంగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాడు. అతనితో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నాడు. రద్దీగా ఉన్న రోడ్డుపై ఆ వ్యక్తి తన మోటార్‌సైకిల్‌ను హాయిగా పార్కింగ్ చేసుకుని రోడ్డు మధ్యలో కుర్చీలో కూర్చుని రీలు వేసుకోవడం వీడియోలో కనిపిస్తోంది. అతని చుట్టూరా వాహనాలు వేగంగా వెళ్తుండటం వీడియోలో కనిపిస్తుంది.

ఈ సంఘటన సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశమైంది. ఈ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో vipingurjarofficial అనే ఖాతాతో షేర్‌ చేయబడింది. ఈ రీల్ మిలియన్ల సార్లు వీక్షించబడింది, అయితే 1.5 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేసారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..