
పాము పేరు వింటే చాలు కొంతమంది ఆమడదూరం పారిపోతారు. ఎందుకంటే పాము కరిస్తే మామూలుగా ఉండదు. అలాంటిది పాము మన దగ్గరలో ఉంటే.. ఇంకేమైనా ఉందా.! గుండె ఒక్కసారిగా ఝల్లుమంటుంది. అయితే అందరూ అలాగే ఉండరు. కొందరికి పాములను పట్టుకోవడమే హాబీ. అందుకే వారిని స్నేక్ క్యాచర్స్ అంటారు. వాళ్లు జనావాసాల్లో దొరికిన పాములను పట్టి అడవుల్లో వదులుతూ ఉంటారు. ఇక ఇంకొందరు ఆ పాములతోనే గారడీ విద్యలు చేస్తూ జనాలను ఆకట్టుకుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.! పాములతో గారడీ చేసే ఓ వ్యక్తికి సంబంధించిన వీడియోను బాలీవుడ్ నటుడు విద్యుత్ జమాల్ తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది.
ఇందులో ఓ వృద్దుడు పామును ముక్కులోకి దూర్చుకుని.. నోటి ద్వారా దానిని బయటికి తీస్తాడు. ఇలా చేస్తున్నప్పుడు పాము తన తోకను ఊపుతున్నా.. అతడు ఎక్కడా కూడా భయపడలేదు.. కంగారుపడలేదు. ఈ వీడియోను చూస్తే మాత్రం గగుర్పాటుకు గురి చేసే విధంగా ఉంటుంది. విద్యుత్ జమాల్ దీనిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ.. ”ఐ లవ్ మై ఇండియా’ అని క్యాప్షన్ ఇచ్చాడు.
దీనిపై నెటిజన్లు భిన్నభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆశ్చర్యపోతూ కామెంట్ చేయగా.. మరికొందరు జమాల్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘అలా ఆ పామును హింసించడం సరికాదని.. ఆయన ఇలా చేయడం కరెక్ట్ కాదని” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, ఇటీవల ఒడిశాకు చెందిన ఓ యువకుడు ఊపిరి ఊది మరీ నాగుపాముకు ప్రాణం పోయడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. స్నేహశీష్ అనే స్నేక్ క్యాచర్ అపస్మారక స్థితిలో ఉన్న పాముకు స్ట్రా సాయంతో ఊపిరి ఊది ప్రాణం పోశాడు.. ఆ తర్వాత అటవీ ప్రాంతంలో వదిలేశాడు. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్నేహశీష్ చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.
Also Read:
రోజూ ఎన్ని బాదంపప్పులు తినాలి.? అతిగా తింటే ఏమవుతుంది.! ఈ విషయాలు తెలుసుకోండి
వామ్మో.. మొసలితో ఆ పిచ్చి గేమ్స్ ఏంటి అమ్మాయి.? వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఈ ఫ్యాన్సీ నెంబర్‌కు క్రేజ్ మాములుగా లేదు.. ఏకంగా రూ. 7.6 లక్షలకు అమ్ముడైంది.!