Viral Video: కొంతమంది చేసే పనులు భలే విచిత్రంగా ఉంటాయి. బ్రెయిన్ ఎక్కువైతే చిత్ర విచిత్రమైన ఐడియాస్ వస్తుంటాయి కొంతమందికి. ఆ క్షణం అది చూస్తే నవ్వొస్తుంది కానీ.. కాస్త ఆలోచితే ఏం ఐడియా గురూ అంటూ పొగిడేయాలనిపిస్తుంది. తాజాగా ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. మనం ఇప్పటివరకు సోషల్ మీడియాలో లైకులు కోసం ఫాలోయింగ్ పెంచుకోవడం కోసం పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటారు. కానీ ఈ వ్యక్తి అలా చేయలేదు. కానీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయాడు. ఇంతకు ఆ వ్యక్తి చేసిన పని ఏంటో తెలిస్తే మీరు కూడా నవ్వు ఆపుకోలేరు. మాములుగా ఆహారం తినడానికి చాలా మంది చేతులును ఉపయోగిస్తారు. కొందరు స్పూన్ లు, ఫోర్క్ లు ఉపయోగిస్తారు. ఇక విదేశాల్లో అయితే చాప్‌స్టిక్ తో ఆహారాన్ని తింటుంటారు.. అయితే చాప్‌స్టిక్ లేకపోవడంతో ఓ వ్యక్తి ఏం చేశాడంటే..
టేబుల్ నిండా ఆహారపదార్ధాలు.. అందరూ ఆవురావురుమంటూ లాగించేస్తున్నారు. పాపం ఆకలితో ఉన్న ఈ అంకుల్ కు మాత్రం చాప్‌స్టిక్ లేదు. దాంతో అతడు అక్కడే ఉన్న ఓ బార్బీ బొమ్మను చాప్‌స్టిక్ గా వాడేశాడు.. ఆ బొమ్మ కళ్ళు పొడవుగా ఉండటంతో వాటిని చాప్‌స్టిక్‌గా చేసుకొని ఆహారం తిన్నాడు. ఇప్పుడు ఏ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు. కొందరు మాత్రం ఐడియా అదుర్స్ అంటూ అతడిని పొగిడేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ‘ప్యూబిటీ’లో ఈ వీడియో షేర్ అయ్యింది. ఈ ఫన్నీ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.