AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మానవత్వం చాటుకున్న వాహనదారుడు.. దేవాంగపిల్లి రియాక్షన్ చూస్తే కంట కనీళ్లు ఆగవు..

జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా స్లోత్ (దేవాంగపిల్లి) అనే అడవి జంతువును ఓ వ్యక్తి కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: మానవత్వం చాటుకున్న వాహనదారుడు.. దేవాంగపిల్లి రియాక్షన్ చూస్తే కంట కనీళ్లు ఆగవు..
Soth Bear Viral Video
Janardhan Veluru
|

Updated on: Nov 10, 2021 | 12:26 PM

Share

జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా స్లోత్ (దేవాంగపిల్లి) అనే అడవి జంతువును ఓ వ్యక్తి కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్లోత్ జంతువులు ఎక్కవుగా సౌత్ అమెరికా, సెంట్రల్ అమెరికాలో కనిపిస్తుంటాయి. రోజులో 15 గంటల పాటు నిద్రించే ఈ జంతువులు.. అతి మెల్లగా నడుస్తాయి. వైరల్ అవుతున్న వీడియో విషయానికొస్తే.. మెల్లగా రోడ్డు దాటుతున్న స్లోత్‌ను ఓ వాహనదారుడు గుర్తిస్తాడు. వెనుక నుంచి వస్తున్న వాహనాల నుంచి దానికి ముప్పు వాటిళ్లే అవకాశమున్నందున దాన్ని రక్షించాలని నిర్ణయించుకుంటాడు. వాహనాన్ని ఆపి.. రోడ్‌పైనున్న స్లోత్‌ను అతి జాగ్రత్తగా బయటకు తీసి చెట్టుపై విడిచిపెట్టి మానవత్వాన్ని చాటుకుంటాడు.

తనకు సాయపడినందుకు పెద్ద థ్యాంక్స్ అన్నట్లు స్లోత్.. ఆ వ్యక్తికి హైఫై ఇస్తుంది. ఈ వీడియో జంతు ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆ జంతువు రియాక్షన్ చూశాక కళ్లలో నీరు ఆగడం లేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రోడ్డుపై ప్రమాదంలో చిక్కుకున్న జంతువును కాపాడిన ఆ వ్యక్తిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. తనకు సాయపడినందుకు మూగజీవి ఆ వ్యక్తికి ప్రత్యేకంగా హైఫైతో ధన్యవాదాలు తెలియజేసిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. మూగజీవాలను కాపాడాలని పిలుపునిస్తున్నారు.

స్లోత్‌ను కాపాడిన వాహనదారుడు.. వీడియో

Also Read..

Watch Video: సినిమా సీన్ తలపించిన ప్రమాదం.. సీసీ టీవీ కెమెరాలో కనిపించిన దృశ్యాలు..

Tragedy: పరువు పోయిందని.. ఐదుగురు బలవన్మరణం.. వెలుగులోకి షాకింగ్ విషయాలు