Viral Video: ప్రమాదకరమైన కింగ్‌ కోబ్రాకు డ్రింకింగ్‌ వాటర్‌.. వీడియో చూసి షాకవుతున్న నెటిజన్లు

|

Jul 24, 2022 | 9:31 PM

Viral Video: సోషల్‌ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతుంటాము. ముఖ్యంగా పాములు, పులులు, మొసళ్లు రకరకాల జంతువుల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి..

Viral Video: ప్రమాదకరమైన కింగ్‌ కోబ్రాకు డ్రింకింగ్‌ వాటర్‌.. వీడియో చూసి షాకవుతున్న నెటిజన్లు
Viral Video
Follow us on

Viral Video: సోషల్‌ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతుంటాము. ముఖ్యంగా పాములు, పులులు, మొసళ్లు రకరకాల జంతువుల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ఏదైనా వీడియో వైరల్‌ కావాలంటే అది సోషల్‌ మీడియా అని చెప్పక తప్పదు. ఇక కింగ్‌ కోబ్రా లాంటి ప్రమాదకరమైన పాముల వీడియోలు మాత్రం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి. సామాన్యంగా పాములంటే అందరికి వణుకే. ప్రపంచంలో వేలాది జాతుల పాములు ఉన్నాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే విషపూరితమైనవి, చాలా ప్రమాదకరమైనవి.

 

ఇవి కూడా చదవండి

విషపూరిత, ప్రమాదకరమైన పాముల జాబితాలో మొదటి పేరు కింగ్ కోబ్రా. అది కాటేసిందంటే సకాలంలో చికిత్స అందించాల్సిందే. లేకపోతే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. ఇదే సమయంలో ఓ నల్ల నాగుపాము వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీనిని చూస్తే షాక్‌కు గురవుతారు. ఓ వ్యక్తి ఓ గ్లాసులో నీళ్లు పోసి ఈ ప్రమాదకరమైన పాముకు తాగిస్తున్నాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. కేవలం 9 సెకన్లు ఉన్న ఈ వీడియోను లక్షలాది మంది వీక్షిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి