దాదాపు అందరూ లగ్జరీ స్పోర్ట్స్ కారు కావాలని కలలు కంటారు. అయితే, ఇది కొంతమందికే సాధ్యమవుతుంది. ఇందులో కొందరు మాత్రం చాలా లక్కీ పర్సన్స్ కూడా ఉంటారండోయ్. అలాంటి వారు లాటరీలో దక్కించుకున్నవారు. ఇక వారి గురించి చెప్పేది ఏముంటుంది. ఆనందానికి అవధులు ఉండవు. ఇలాంటి సీన్ ఓచోట జరిగింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.. గతేడాది డిసెంబర్‌లో స్కాట్లాండ్‌లోని ఫాల్కిర్క్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడికి ఇలాంటిదే జరిగింది. గ్రాంట్ బర్నెట్ అనే వ్యక్తి ఇటీవల ఒక క్లిక్ పోటీ లాటరీలో కోట్ల విలువైన లగ్జరీ లంబోర్ఘిని హురాకాన్ స్పోర్ట్స్ కారును గెలుచుకున్నాడు. అయితే ఈ కారు గెలిచిన కొద్ది వారాలకే జరిగిన సంఘటనతో ఈ కారు ప్రియుడికి కన్నీళ్లే దిక్కయ్యాయి.
స్కాట్లాండ్ నివాసి గ్రాంట్ బర్నెట్, లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేయడానికి 99P (పెన్స్) (మన కరెన్సీలో సుమారు రూ.495.67లు) మాత్రమే ఖర్చు చేశాడు. అయితే బర్నెట్ ఈ కారు డ్రైవింగ్‌ను పూర్తిగా ఆస్వాదించలేకపోయాడు. ప్రమాదంలో ఈ కారు బాగా దెబ్బతింది. నివేదిక ప్రకారం, ఇది కంపెనీ మొట్టమొదటి సూపర్ కార్ లాటరీ. ఇది దేశంలోని కార్ల ప్రియుల దృష్టిని ఆకర్షించింది.
గ్లోబల్ మీడియా నివేదికల ప్రకారం, లాటరీని గెలుచుకున్న తర్వాత బర్నెట్‌కి రెండు ఎంపికలు ఇచ్చారంట. అతను హురాకాన్ LP స్పోర్ట్స్ కారును తీసుకోవచ్చు లేదా అందుకు బదులుగా దాదాపు రూ. 99 లక్షల 52 వేలు ఎంచుకోగల అవకాశం ఉంది. బర్నెట్ మొదటి ఎంపికను ఎంచుకున్నాడు. ఇంటికి ధగధగ మెరుస్తున్న లగ్జరీ లంబోర్ఘిని హురాకాన్ స్పోర్ట్స్ కారును తీసుకొచ్చాడు. ఇంకేముంది.. మనోడి ఆర్భాటానికి హద్దే లేకుండాపోయింది.
#GrantBurnett devastated after winning a £160k #LamborghiniHuracan with a 99p draw ticket – only to crash it weeks later.
He entered the Click Competition to win the 201mph supercar instead of the £100k cash alternative. I actually feel really sorry for him, tragic . . ?♂️ pic.twitter.com/q2W1zZSCrJ
— Mr Pål Christiansen ????? (@TheNorskaPaul) February 27, 2023
లాటరీలో కారు గెలిచిన కొన్ని వారాలకే బర్నెట్ తన లగ్జరీ కారుకు యాక్సిడెంట్ జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు రావడం మొదలైంది. ఎందుకంటే అతను దానిని గంటకు 150 మైళ్ల వేగంతో నడుపుతున్నాడంట. ఇలాంటి వార్తలతో బర్నెట్ తన ఫేస్‌బుక్‌లోని ఒక పోస్ట్‌లో క్లారిటీ ఇచ్చాడు. తన కారుకు స్పీడ్ వల్ల యాక్సిడెంట్ కాలేదని, ఓ ఆవును ఢీకొనడం వల్ల జరిగిందంటూ పోస్ట్ చేశాడు. ఆవు కారును ఢీకొట్టిందని, దీంతో కారు పక్కనే ఉన్న వేరే కార్లను ఢీకొట్టిందని బర్నెట్ రాసుకొచ్చాడు.
అయితే, ఈ ప్రమాదంలో గ్రాంట్ బర్నెట్ సురక్షితంగా బయటపడ్డాడు. సుమారు రూ.3.63 కోట్ల విలువైన విలాసవంతమైన కారు ఇలా దెబ్బతినడంతో చాలా బాధపడుతున్నాడంట.
కారు గురించి మాట్లాడితే, కంపెనీ ఈ కారులో 5 లీటర్ల సామర్థ్యంతో 10-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించింది. ఇది 602 bhp, 560 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7 గేర్లతో కూడిన ఈ స్పోర్ట్స్ కారు గంటకు 325 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టగలదు. ప్రస్తుతం ఈ కారును ఉత్పత్తి చేయడం లేదంట. చివరిగా నమోదు చేయబడిన ధర రూ.3.63 కోట్లుగా ఉంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..