
చేపలు పట్టడం ఓ ఆర్ట్.. అది అందరికీ అంత ఈజీ కాదండోయ్. కొంతమంది చేపలను భలే సులభంగా పట్టేస్తే.. మరికొంతమంది ఆపసోపాలు పడుతుంటారు. ఇక సోషల్ మీడియాలో నవ్వు తెప్పించే వీడియోలకు కొదవలేదు. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దాన్ని చూశాక మీరు పడిపడి నవ్వడం ఖాయం.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి చేపలు పట్టేందుకు బ్రిడ్జ్ దగ్గరకు వచ్చినట్లు మీరు చూడవచ్చు. సాధారణంగా మనం గాలానికి ఎరను కట్టి.. ఆ త్రాడును సముద్రంలోకి వేస్తాను. అయితే ఈ ఆణిముత్యం మాత్రం గాలంతో పాటు అతడు కూడా ఎగురుకుంటూ.. ఎగురుకుంటూ వెళ్లి నీళ్లలో పడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా, ఈ ఫన్నీ వీడియోను ‘tansuyegen’ అనే నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. కేవలం 7 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోకు ఇప్పటివరకు 32 మిలియన్ల వ్యూస్ వచ్చిపడ్డాయి. కొంతమంది ‘అతడు మద్యం మత్తులో ఉన్నాడని’ కామెంట్ చేయగా.. మరికొందరు ‘వరస్ట్ యాక్టర్’ అంటూ రాసుకొచ్చారు.
Trying to fish the best crypto coins?
— Tansu YEĞEN (@TansuYegen) July 27, 2022