Viral Video: మైండ్ బ్లాంక్ యాక్సిడెంట్.. రెప్పపాటులో ప్రాణాలతో బయటపడ్డాడు.. షాకింగ్ వీడియో

Viral Video: ప్రమాదం చెప్పి రావు. ఒక్కసారి రెడ్డెక్కితే.. గమ్యం చేరే వరకు ప్రాణాలకు గ్యారెంటీ లేదు. చాలా ప్రమాదాలు అత్యంత ఘోరంగా జరుగుతాయి.

Viral Video: మైండ్ బ్లాంక్ యాక్సిడెంట్.. రెప్పపాటులో ప్రాణాలతో బయటపడ్డాడు.. షాకింగ్ వీడియో
Accident

Updated on: Jul 18, 2022 | 8:09 AM

Viral Video: ప్రమాదం చెప్పి రావు. ఒక్కసారి రెడ్డెక్కితే.. గమ్యం చేరే వరకు ప్రాణాలకు గ్యారెంటీ లేదు. చాలా ప్రమాదాలు అత్యంత ఘోరంగా జరుగుతాయి. రెప్పపాటు కాలంలో ఊహించని ప్రమాదాలతో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. తాజాగా అలాంటి షాకింగ్ యాక్సిడెంట్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, అతను లేచిన సమయం బాగున్నట్లుంది. యమధర్మరాజుకు హాయ్ చెప్పి వచ్చాడు. అవును, క్షణకాలంలో ప్రాణాలతో బయటపడ్డాడు. కంటైనర్ టైర్ కింద పడిపోయిన వ్యక్తి.. రెప్పపాటులో ప్రమాదం నుంచి బయపడ్డాడు.

జోరు వాన కురుస్తుండగా.. ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తున్నాడు. వాహనాల రద్దీ కూడా బాగానే ఉంది. అయితే, ఇంతలో అతని బైక్ స్కిడ్ అయి కింద పడిపోయింది. అతనూ పడిపోయాడు. ఇంతలో అతని వెనకాలే.. ఓ ట్రక్ దూసుకువచ్చింది. అయితే, కిందపడిన వ్యక్తి ట్రక్ రాకను గమనించి.. రెప్పపాటులో బయటకు పరుగులు తీశారు. దాంతో అతను సేవ్ అయ్యాడు. కాగా, ఈ ఘటన అంతా పక్కనే పార్క్ చేసిన కారులోని కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్ అయ్యింది. భూమిమీద నూకలు ఉండటం అంటే ఇదేనేమో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ షాకింగ్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..