Guinness World Records: ఇతనో మ్యాగ్నెట్‌ మ్యాన్‌..! ఒంటిపై స్పూన్లతో గిన్నిస్‌ రికార్డు.. వీడియో వైరల్

అబోల్‌ఫజల్ సబర్ మొఖ్తరి అనే ఈ వ్యక్తి ఇలాంటి వింత పనితో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. అతను తన శరీరంపై గరిష్ట సంఖ్యలో చెంచాలను అతికించుకుని బ్యాలెన్స్ చేయడం ద్వారా ఈ రికార్డు సృష్టించాడు. అతని శరీరంపై 96 స్పూన్లు అంటించుకున్నట్టు చూపించే ఫోటోలు, వీడియోలు ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. ఈ వీడియో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక ఖాతాలో కూడా షేర్ చేయబడింది.

Guinness World Records: ఇతనో మ్యాగ్నెట్‌ మ్యాన్‌..! ఒంటిపై స్పూన్లతో గిన్నిస్‌ రికార్డు.. వీడియో వైరల్
Guinness Record

Updated on: May 26, 2025 | 10:45 AM

అనేక వింత కారణాల వల్ల ప్రజలు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంటారు. ప్రపంచంలోనే అత్యంత పొట్టి, ఎత్తైన, వెంట్రుకలు లేని ఇలా విభిన్న కేటగిరుల్లో అనేక కారణాల వల్ల ప్రజలు రికార్డులు సృష్టిస్తారు. కానీ, ఇవన్నీ కాకుండా ఇటీవల ఒక వ్యక్తి తనదైన స్టైల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ఈ వ్యక్తి తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఇరాన్‌కు చెందిన ఈ వ్యక్తి ఒకేసారి తన శరీరంపై అత్యధిక చెంచాలను బ్యాలెన్స్ చేయడం ద్వారా తన సొంత ప్రపంచ రికార్డును తానే బద్దలు కొట్టుకున్నాడు. నివేదికల ప్రకారం, అతను ఈ ఘనత సాధించడం ఇది మూడోసారి. అబోల్‌ఫజల్ సబర్ మొఖ్తరి అనే ఈ వ్యక్తి ఇలాంటి వింత పనితో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. అతను తన శరీరంపై గరిష్ట సంఖ్యలో చెంచాలను అతికించుకుని బ్యాలెన్స్ చేయడం ద్వారా ఈ రికార్డు సృష్టించాడు. అతని శరీరంపై 96 స్పూన్లు అంటించుకున్నట్టు చూపించే ఫోటోలు, వీడియోలు ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. ఈ వీడియో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక ఖాతాలో కూడా షేర్ చేయబడింది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి…


అతని శరీరంపై చెంచాలు ఎలా ఉంచుతున్నారో వీడియోలో చూడొచ్చు. చూస్తుంటే అతని శరీరంలో ఏదో అయస్కాంత శక్తి ఉన్నట్లుగా అనిపిస్తుంది. వీడియోపై కూడా అలాంటివే కొన్ని వ్యాఖ్యలు వచ్చాయి. ఈ స్పూన్లు తమ శరీరానికి ఎలా అతుక్కుపోతాయో చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈ వ్యక్తి నిజంగా ఐరన్ మ్యాన్ అని ఒక యూజర్ వ్యాఖ్యానించారు. అతని శరీరంలో అయస్కాంతం ఉందా అని కొంతమంది అనుమానం వ్యక్తం చేశారు. అదే సమయంలో, మరొక వినియోగదారుడు ఇలాంటి రికార్డులు సృష్టించే ఆలోచన ప్రజలకు ఎలా వస్తుందంటూ సందేహం వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..