AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: వీడి దుంపతెగ.. మ్యాచ్‌లో ఓడినందుకు పిల్లలపై పైశాచికత్వం.. కాలితో తన్నుతూ, బూతులు తిడుతూ.. వైరల్ వీడియో

ఆటల్లో గెలుపు, ఓటములు సహజమే. అయితే, గెలిచిన వారితోపాటు కోచ్‌లు కూడా ఎంతో సంబురాలు చేసుకుంటాయి. ఓడిన జట్టు మాత్రం బాధను దిగమింగుకుంటూ రాబోయే పోటీల కోసం కసరత్తులు ముమ్మరం చేస్తుంటారు. అయితే, అప్పుడప్పుడు మాత్రం కొన్ని షాకింగ్ సీన్స్ కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఓడిన జట్టు సభ్యుల పట్ల ప్రవర్తించే తీరు అమానుషంగా ఉంటుంది.

Video: వీడి దుంపతెగ.. మ్యాచ్‌లో ఓడినందుకు పిల్లలపై పైశాచికత్వం.. కాలితో తన్నుతూ, బూతులు తిడుతూ.. వైరల్ వీడియో
Kicking Young Players In Tamil Nadu
Venkata Chari
|

Updated on: Aug 14, 2024 | 2:27 PM

Share

ఆటల్లో గెలుపు, ఓటములు సహజమే. అయితే, గెలిచిన వారితోపాటు కోచ్‌లు కూడా ఎంతో సంబురాలు చేసుకుంటాయి. ఓడిన జట్టు మాత్రం బాధను దిగమింగుకుంటూ రాబోయే పోటీల కోసం కసరత్తులు ముమ్మరం చేస్తుంటారు. అయితే, అప్పుడప్పుడు మాత్రం కొన్ని షాకింగ్ సీన్స్ కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఓడిన జట్టు సభ్యుల పట్ల ప్రవర్తించే తీరు అమానుషంగా ఉంటుంది. తాజాగా ఇలాంటిదే తమిళనాడులో చోటు చేసుకుంది. దీంతో సోషల్ మీడియా వ్యాప్తంగా నిరసనలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

తమిళనాడులో స్కూల్ గేమ్‌లో ఓడిపోయినందుకు కోచ్ తన విద్యార్థుల పట్ల ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. పాఠశాలలోని ఇతర విద్యార్థుల ముందు కాళ్లతో తన్నుతూ, తిడుతున్నాడు. సదరు వ్యక్తి యువ ఫుట్‌బాల్ ఆటగాళ్లపై కనికరం లేకుండా ప్రవర్తించాడు.

అయితే, ఆ వ్యక్తి జట్టు కోచ్ అవునా కాదా అనేది తెలియలేదు. కానీ, అతని ప్రవర్తన బట్టి చూస్తే చిన్న పిల్లలపై తన కోపాన్ని బయటపెడుతున్నట్లు అనిపిస్తుంది. ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.

చాలా మంది అభిమానులు AIFFని ట్యాగ్ చేశారు. అలాంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ, అలా జరిగే వరకు ఈ వీడియోను షేర్ చేయాలంటూ పిలిపునిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ కల్ిక్ చేయండి..